నిన్న చెన్నైలో జరిగిన “దేవర” (Devara) ప్రీరిలీజ్ ఈవెంట్ తరహా ప్రెస్ మీట్ లో తారక్ (Jr NTR) తనదైన చాకచక్యంతో అందరినీ ఆకట్టుకోగా.. అదే సమయంలో జాన్వీకపూర్ (Janhvi Kapoor) కూడా స్పష్టమైన తమిళ భాషలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచిన మరీ అలరించింది. తమిళంలో తప్పుల్లేకుండా ఆమె మాట్లాడిన విధానానికి తమిళ మీడియా & సినిమా ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దాంతో ఇప్పుడు సెప్టెంబర్ 22న తెలుగు ప్రీరిలీజ్ ఈవెంట్లో జాన్వీకపూర్ ఏం మాట్లాడుతుంది, ఎలా మాట్లాడుతుంది అనేది హాట్ టాపిక్ గా మారుతుంది.
Janhvi Kapoor
శ్రీదేవి (Sridevi) కుమార్తె కావడం, తెలుగులో ఆల్రెడీ రెండు సినిమాలు సైన్ చేయడం, ముఖ్యంగా ఆల్రెడీ బాలీవుడ్ ఇంటర్వ్యూల్లో ఇప్పటికే పలుమార్లు కొన్ని తెలుగు పదాలు వాడడంతో, జాన్వీకపూర్ స్వచ్ఛమైన తెలుగు స్పీచ్ హాట్ టాపిక్ గా మార్చింది. ఎందుకంటే.. తెలుగులో ఏళ్ల తరబడి సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్లు కూడా “అందరికీ నమస్కారం” తప్ప తెలుగులో మాట్లాడిన దాఖలాలు లేవు. ఈమధ్య వచ్చే హీరోయిన్లు కనీసం తమ పాత్రలకు డబ్బింగ్ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
స్టార్ హీరోయిన్లు ఆది కూడా చేయడం లేదు. ఎందుకో వాళ్లకి ముందు నుండీ తెలుగు భాషను పెద్ద సీరియస్ గా పట్టించుకునేవారు కారు. సదరు హీరోయిన్ల పేర్లు ప్రస్తావించడం కూడా వేస్ట్ అనుకోండి. ఈ తరుణంలో జాన్వీకపూర్ గనుక ముద్దుగా తెలుగులో మాట్లాడిందంటే మాత్రం తెలుగు ప్రేక్షకులు ఆమెను ఓన్ చేసుకోవడం ఖాయం.
ఇక బాలీవుడ్ లో ఆమె చిన్న లేదా మీడియం రేంజ్ హీరోలతో పని చేయాల్సిన అవసరం ఉండదు. హ్యాపీగా ఇక్కడ స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ సౌత్ లో సెటిల్ అయిపోవచ్చు. సో, జాన్వీకపూర్ కి (Janhvi Kapoor) “దేవర” ప్రీరిలీజ్ ఈవెంట్ కి స్పీచ్ రాసేవాళ్లు ఎవరైతే ఉన్నారో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి పదాలు, మంచి మాటలు రాయాల్సిందిగా మనవి!