బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘జవాన్’. సెప్టెంబర్ 7న హిందీ, తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. ఈ ఏడాది ఆరంభంలో రిలీజ్ అయిన ‘పఠాన్’ సినిమాతో షారుఖ్ ఖాన్ పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ సినిమా వెయ్యి కోట్లు పైనే వసూల్ చేసి అతనికి స్ట్రాంగ్ కంబ్యాక్ ను అందించిన సంగతి తెలిసిందే.
ఇక దర్శకుడు అట్లీ తీసిన అన్ని సినిమాలు సూపర్ హిట్లే. అందుకే ‘జవాన్’ మూవీ పై మొదటి నుండీ తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రని పోషించారు.టీజర్, ట్రైలర్లు కూడా ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. దీంతో తెలుగులో కూడా ఈ చిత్రానికి బిజినెస్ బాగా జరిగింది. వాటి వివరాలు గమనిస్తే :
నైజాం
1.50 cr
సీడెడ్
0.87 cr
ఉత్తరాంధ్ర
0.93 cr
ఈస్ట్
0.22 cr
వెస్ట్
0.20 cr
గుంటూరు
0.35 cr
కృష్ణా
0.32 cr
నెల్లూరు
0.20 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
4.59 cr
‘జవాన్’ (Jawan) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.59 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.85 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ అయితే అదిరిపోయాయి. టాక్ కనుక పాజిటివ్ గా వస్తే.. ఈజీగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.