ఈమధ్యకాలంలో షూటింగ్ స్టార్ట్ అవ్వకుండానే రచ్చ చేస్తున్న ఏకైక చిత్రం “లక్ష్మీపార్వతి ఎన్టీయార్”. సీనియర్ ఎన్టీయార్ సెకండ్ వైఫ్ లక్ష్మీపార్వతి కోణంలో వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రకటించినప్పట్నుంచి రచ్చ మామూలుగా లేదు. అయితే.. వర్మ కూడా ఆ రచ్చను పబ్లిసిటీ కోసం బానే వాడేసుకొంటున్నాడు. అయితే.. వర్మ అండ్ కో పబ్లిసిటీ అండ్ ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా.. కొన్ని మీడియా హౌసెస్ సినిమాకి సంబంధించిన క్యాస్టింగ్ ను తమకు నచ్చినట్లుగా ఫిక్స్ చేసేస్తున్నారు. అప్పట్లో సినిమాలో రోజా కీలకపాత్ర పోషించనుందని కొందరు రాస్తే.. ఆ విషయమై వర్మ స్వయంగా స్పందించి ఆ వార్తలను కొట్టిపాడేశారు.
ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో “లక్ష్మీపార్వతి ఎన్టీయార్”లో చంద్రబాబు నాయుడుగా జేడీ చక్రవర్తి నటించనున్నారని వార్తలొచ్చాయి. చంద్రబాబు పాత్రకి జేడీ పర్ఫెక్ట్ అని, అతనైతేనే సరిగ్గా చేయగలడని స్పెక్యులేషన్స్ కూడా వచ్చాయి. కానీ.. ఆ స్పెక్యులేషన్స్ లో ఎలాంటి నిజం లేదని, ఇంకా క్యాస్టింగ్ కు సంబంధించి తాను ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని, త్వరలోనే తాను స్వయంగా ఎన్టీయార్ గా ఎవరు నటిస్తున్నారు, చంద్రబాబు పాత్ర ఎవరు పోషిస్తున్నారు వంటి విషయాలను స్వయంగా వెల్లడిస్తానని వర్మ పేర్కొన్నారు. నిజమే.. ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే వర్మ రంగంలోకి దిగాల్సిందే. ఆ ఎనౌన్స్ మెంట్ ఏదో త్వరగా చేసేయ్ నాయనా.