ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న నటుడు..

విదేశంలో భారతీయ నటుడి మీద దాడి జరిగిందనే న్యూస్ ఫిలిం ఇండస్ట్రీలో కలకలం రేపింది.. ప్రస్తుతం ఆ నటుడు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. వివరాల్లోకి వెళ్తే.. 37 ఏళ్త అమన్ ధలివాల్ పంజాబ్‌లో పాపులర్ మోడల్ కమ్ యాక్టర్.. పలు సూపర్ హిట్ సినిమాల్లో గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.. హిందీలో ‘జోధా అక్బర్’, ‘బిగ్ బ్రదర్’ వంటి పలు మూవీస్ చేశాడు..

తెలుగులో మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఖలేజా’ మూవీలో జాన్ అనే క్యారెక్టర్‌‌లో కనిపించాడు అమన్ ధలివాల్.. అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం అమన్ ధలివాల్ అమెరికాలోని కాలిఫోర్నియాలో నివాసముంటున్నాడు.. గురువారం (మార్చి 16) ఓక్ గ్రౌండ్స్ ప్రాంతంలో రెగ్యులర్‌గా తను వర్కౌట్స్ చేసే జిమ్‌కి వెళ్లాడు.. అక్కడే ఓ ఆగంతకుడు అతనిమీద విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.. దాడికి ముందు అమన్ కసరత్తులు చేసుకుంటున్న సమయంలో ఆగంతకుడు జిమ్‌లోకి చొరబడి సిబ్బందిని మంచినీళ్లు అడిగాడని..

మాట మాట పెరగడంతో గొడవైందని.. అమన్ మధ్యలో వెళ్లి అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించడంతో గన్ ఫైర్ చేశాడు.. ఈ ఘటనలో అమన్ ఛాతీ, మెడ, తల భుజం మీద తీవ్ర గాయాలయ్యాయి.. వెంటనే రక్తసిక్తమైన అతడిని జిమ్ సిబ్బంది దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.. అలాగే ఆగంతకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.. మెరుగైన చికిత్సనందిస్తున్నామని, ప్రస్తుతం అమన్ ధలివాల్ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలియజేశారు..

దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ అక్కడ నివసిస్తున్న ఇండియన్స్, అమన్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.. ఈ విషయం తెలుసుకున్న అమన్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.. అమెరికాలోని భారతీయులు సైతం షాక్ అయ్యారు.. అలాగే ఒంటినిండా కట్లతో ఉన్న అమన్‌ని చూసి పంజాబ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ వార్త మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది..


రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus