‘దేవర’(Devara) సినిమా ఫలితం గురించి డివైడ్ టాక్ వచ్చి ఉండొచ్చు కానీ.. ఆ సినిమా కోసం తారక్ (Jr NTR) పడ్డ కష్టం గురించి ఎక్కడా ఎవరూ తక్కువ చేయలేరు. ఎందుకంటే సినిమా ఒక దశ తర్వాత కొరటాల చేతి నుండి తారక్, యాక్షన్ కొరియోగ్రాఫర్ చేతిలోకి వచ్చేసింది అని అంటున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో సినిమాలో అండర్ వాటర్ సీక్వెన్స్‌ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ‘దేవర’ సినిమా అండర్ వాటర్ సీక్వెన్స్ కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందని ఎన్టీఆర్ ఇటీవల చెప్పుకొచ్చాడు.
Jr NTR
తొలి రెండు రోజుల్లో రూ.240 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా గురించి తారక్ అమెరికాలో కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) కోసం చాలా రోజులు నీళ్లలోనే ఉండాల్సి వచ్చిందని, ఇప్పుడు దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కూడా నన్ను వదల్లేదు అంటూ నవ్వేశాడు. ‘దేవర’ సినిమా ఒక్క పార్టుతో అండర్ వాటర్ సీనస్ అయిపోతాయేమో అనుకున్నాను.
కానీ, మీ నుండి వచ్చిన స్పందన చూస్తుంటే ‘దేవర 2’కు కూడా వాటర్ సీక్వెన్స్ తప్పేలా లేదు అని చెప్పాడు తారక్. ఇక తాను వీఎఫ్‌ఎక్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ కాదని, ఆ విషయంలో ఎస్‌ఎస్ రాజమౌళి (S. S. Rajamouli) ఎంతసేపైనా మాట్లాడతారని చెప్పాడు. ఒక నటుడిగా అది ఎంత కష్టమో తనకు బాగా తెలుసని చెప్పాడు. ఇక వీఎఫ్‌ఎక్స్ ద్వారా నీటిని క్రియేట్ చేసి, నిజమైనదిగా కనిపించేలా చేయడం చాలా కష్టమని తారక్ అన్నాడు.
క్లైమాక్స్‌లో వచ్చే షార్క్ సీన్, అండర్ వాటర్ సీక్వెన్స్ కోసం 35 రోజులకు పైగా పనిచేశామని చెప్పిన ఎన్టీఆర్ ఉదయం 8 నుండి సాయంత్రం 5 వరకు నీళ్లలో దిగుతూ బయటకు వస్తూ ఉండాల్సి వచ్చేదని చెప్పాడు. ఆ సన్నివేశాలన్నీ అద్భుతంగా రావడానికి చాలా మంది కష్టపడ్డారని అందరినీ గుర్తు చేసుకున్నాడు. తారక్ చెప్పినట్లుగా అండర్ వాటర్ సీక్వెన్స్‌లు అయితే మాత్రం అదిరిపోయాయి అని చెప్పొచ్చు.