సినీ నటుడు తెలుగుదేశం పార్టీ అధినేత దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు నందమూరి హీరో అభిమానులు చేరుకొని ఎన్టీఆర్ కి నివాళులు అర్పిస్తున్నారు. నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి తారక రామారావు రాజకీయాలలో కూడా అదే స్థాయిలో సక్సెస్ అయ్యారు. అయితే ఈయన 1996 జనవరి 18న మరణించారు.
తెలుగు జాతికే ఎంతో గర్వకారణమైనటువంటి ఎన్టీఆర్ వర్ధంతి కావడంతో ఎంతో మంది అభిమానులు ఎన్టీఆర్ కు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి హీరోలు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ తమ తాతకు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ సమాధికి పూలమాలలు అర్పించి, నమస్కరించి తిరిగి వెళ్లిపోయారు. అప్పటికే ఎన్టీఆర్ ఘాట్ వద్ద అభిమానులు ఉండడంతో ఎన్టీఆర్ ని చూడగానే అభిమానులు పెద్ద ఎత్తున తనతో ఫోటోలు కోసం ఎగబడ్డారు. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేయడమే కాకుండా జోహార్ ఎన్టీఆర్ అంటూ తారకరామారావుకి నివాళులు అర్పించారు.
అదేవిధంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పెద్ద ఎత్తున ఎన్టీఆర్ (Jr NTR) ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఎన్టీఆర్ వర్ధంతి కావడంతో సోషల్ మీడియా వేదికగా కూడా నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు… #NTRLivesOn ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ అన్నగారు నటించిన సూపర్ హిట్ సినిమాల వీడియోలను, ఎడిటెడ్ ఫోటోలను షేర్ చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.