దర్శకధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ తర్వాత తెలుగు సినిమా స్థాయిని, తెలుగు వారి గొప్పదనాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పిన ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం.. ‘ఆర్ఆర్ఆర్’.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమరం భీంగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరిగా పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించారు. అసలు చరణ్, తారక్, జక్కన్న కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పటినుండే ఈ సినిమా మీద బీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి..
2018 చివర్లో షూటింగ్ స్టార్ట్ చేస్తే.. 2022 మార్చి నెలాఖరులో కానీ థియేటర్లలోకి రాలేదు. లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టు ప్రపంచ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేసిందీ మూవీ. నేషనల్, ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో.. భారీ బడ్జెట్ తో సాత్వంత్య్రం నేపథ్యంలో రాజమౌళి రూపొందించి ట్రిపులార్ కి ప్రేక్షకాభిమానులు బ్రహ్మరథం పట్టారు. థియేటర్స్, ఓటీటీల్లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసి ఆస్కార్ నామినేషన్స్ వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జపాన్ ఆడియన్స్ కోరిక మేరకు అక్టోబర్ 21న అక్కడ భారీ స్థాయిలో ట్రిపులార్ రిలీజ్ అవనుంది.
ఈ నేపథ్యంలో మూవీ టీం అక్కడ కూడా ప్రమోషన్స్ చెయ్యబోతున్నారు. ఇప్పటికే తారక్, జక్కన్న జపాన్ మీడియాకి ఆన్ లైన్ ఇంటర్వూలిచ్చారు. ఇప్పుడు చరణ్, తారక్, రాజమౌళి కలిసి జపాన్ పయనమయ్యారు. మంగళవారం ఉదయం చరణ్ భార్య ఉపాసనతో కలిసి ఎయిర్ పోర్టులో ఉన్న పిక్స్ వైరల్ అయ్యాయి. రీసెంట్ గా ఎన్టీఆర్, రాజమౌళి ఎయిర్ పోర్టులో కెమెరాల కంటపడ్డారు. దీంతో ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.