పాన్ ఇండియా పాటగా రూపొందిన ‘నాటు నాటు..’ పాన్ ప్రపంచవ్యాప్తంగా అదరగొడుతోంది. ఒవైపు కోట్ల వీక్షణలు, మరోవైపు కోట్లాది రీల్స్‌తో ప్రేక్షకుల హర్షద్వానాలు చేస్తుంటే.. ప్రశంసలు, పురస్కారాలతో సంస్థలు, వ్యక్తులు జేజేలు కొడుతున్నారు. త్వరలో ఆస్కార్ వేదిక మీద ‘నాటు నాటు’ వినిపించబోతోంది. అది కూడా లైవ్‌లో. అవును మీరు చదివింది కరెక్టే. ‘నాటు నాటు..’ పాటను ఆలపించిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ కలసి ప్రతిష్ఠాత్మక ఆస్కార్ వేదిక మీద ఆలపిస్తారని ఆస్కార్స్ ట్వీట్ చేసింది.
ఆస్కార్ వేదిక మీద ‘నాటు నాటు’ లైవ్ పర్‌ఫార్మెన్స్ ఉంటుందని చాలా రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంలో క్లారిటీ వచ్చిందని చెప్పాలి. అయితే గతంలో వచ్చిన పుకార్లలో స్టేజీపై లైవ్ సింగింగ్‌తోపాటు తారక్, రామ్‌చరణ్ డ్యాన్స్ కూడా ఉంటుందని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు కేవలం సింగింగ్ అని మాత్రమే చెబుతున్నారు. సర్‌ప్రైజ్ కోసం డ్యాన్స్ విషయం చెప్పలేదా? లేక కేవలం సింగింగ్ మాత్రమేనా అనేది తెలియాల్సి ఉంది.
అయితే స్టేజీ మీద డ్యాన్స్ చేయకపోయినా.. ఆ పాట స్టేజీ మీద ఆలపిస్తుంటే దిగువ ప్రేక్షకుల ప్లేస్‌లో ఉండే సినిమా టీమ్, ఇతర సినిమాల టీమ్‌లు కాలు కదపకుండా ఉంటాయా అనేది చూడాలి. ఈ సంగతి తేలాలంటే మార్చి 12 రావాల్సిందే. ఆ రోజు అంటే మనకు మార్చి 13 ఉదయం.. ఈ వేదిక జరుగుతుంది. మరి పాటను ఎలా పాడతారు, డ్యాన్స్‌ల సంగతి ఏంటి అనేది ఆ రోజు తెలుస్తుంది.
‘నాటు నాటు..’ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న నేపథ్యంలో ఆస్కార్ కూడా వరిస్తుందని టీమ్ గట్టి విశ్వాసంతో ఉన్నారు. కీరవాణి ఈ పాటను స్వరపరచగా… రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఆలపించారు. చంద్రబోస్ సాహిత్యం అందించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. ఇక ఆ పాటకు ఎన్టీఆర్, రామ్ చరణ్ అదిరిపోయే స్టెప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.