తారక్‌కి పౌరాణికం లుక్ చాలా బాగుంటుంది.. ఈ మాట అనని అభిమానిని, ప్రేక్షకుణ్ని మీరు చూపించగలరా? ఈ మాట ఎవరి దగ్గర అన్నా కష్టమే అని సమాధానం వస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్‌కి ఆ లుక్ అంత అద్భుతంగా నప్పుతుంది. ‘రామాయణం’ సినిమాలో ఆయన ఆ లుక్‌కి 100 శాతం పర్‌ఫెక్ట్ అని చెప్పకనే చెప్పేశారు. ‘యమదొంగ’లో యంగ్ యముడిగా కనిపించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడెందుకు ఈ పౌరాణికం చర్చ అనుకుంటున్నారా? మరోసారి తారక్‌ను అలా చూపించడానికి ఓ ప్రయత్నం జరుగుతోంది అనే వార్తలు రావడమే ఆ కారణం.
‘బాహుబలి’ సినిమా కంటే ముందు మహాభారత గాథను తెరకెక్కించాలని ఉందని రాజమౌళి కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు రాజమౌళి. ‘దాన వీర శూర కర్ణ’ లాంటి క్లాసిక్ తీస్తే.. అందులో తారక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాడు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఏమైందో ఏమో అలాంటి ఆలోచనకు బ్రేక్ ఇచ్చేశారు రాజమౌళి. దీంతో తారక్‌ను అలా చూడాలన్న కోరిక.. కోరికగానే మిగిలిపోయింది ఫ్యాన్స్‌కి. అయితే ఇప్పుడు ఆ కోరిక త్రివిక్రమ్‌తో తీరేలా ఉంది అని అంటున్నారు.
అవును మీరు విన్నది కరెక్టే. త్రివిక్రమ్ – తారక్ కాంబినేషన్‌లో ఓ మైథలాజికల్ సబ్జెక్టుని ప్లాన్ చేస్తున్నారన్న వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇలాంటి హింట్ ఇచ్చింది కూడా త్రివిక్రమ్‌కి, తారక్‌కి బాగా దగ్గర అనే నిర్మాత నాగవంశీనే. ఎప్పుడు మొదలవుతుందో తెలియదు కానీ.. గురూజీ – యంగ్ టైగర్ కాంబోలో ఓ మైథలాజికల్ సినిమా చేయడానికి ఆలోచనలు ఉన్నట్లు చెబుతున్నారు. కొరటాల శివ సినిమా కన్నా ముందు తారక్ – త్రివిక్రమ్ కాంబోనే తెరకెక్కాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ బాగా ప్రచారంలోకి వచ్చింది.
అయితే ఇప్పుడు ప్రచారంలోకి వచ్చిన టాపిక్, కాన్సెప్ట్ అయితే ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇస్తోంది అని చెప్పాలి. అయితే ఇద్దరి ప్రస్తుత లైనప్‌లు చూస్తే కనీసం మూడేళ్లు కష్టం అంటున్నారు. కొరటాల సినిమా తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ సినిమా ఉంది. ఈ సినిమా రెండు పార్టులు అని టాక్. దీంతో కనీసం మూడేళ్లు ఫట్. ఇక త్రివిక్రమ్ అయితే మహేష్‌బాబు సినిమా చేశాక అల్లు అర్జున్‌తో కానీ, రామ్‌చరణ్‌తో కానీ సినిమా చేస్తారని టాక్. సో.. ఈ ఆలోచన బాగున్నా ఎప్పుడు అవుతుందో చెప్పలేం. అయితే మాత్రం అదిరిపోతుందని చెప్పొచ్చు.