టాలీవుడ్ లో నందమూరి పేరు చెప్పుకొగానే ముందుగా వినిపించేది ఆ వంశానికి మూల పురుషుడైన నందమూరి తారక రామారావు గారు. అయితే ఆ తరువాత వచ్చిన బాలయ్య, అటుపై రంగంలోకి దింగిన జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వంశ ప్రతిష్టను కాపాడుకుంటూ, పెద్దాయన లెగెసిని ముందుకు తీసుకుపోతున్నారు. అయితే అదే క్రమంలో తాజాగా విడుదలయిన ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కి కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే ఆడుతుంది సినిమా. ఇక విషయంలోకి వెళితే…ఈ సినిమా చూసిన వారిలో కొందరు సినిమా నీట్ అండ్ క్లీన్ గా ఉంది అంటుంటే….కొందరు ఎన్టీఆర్ రేంజ్ సినిమా కాదు అని అంటున్నారు. ఇక మరికొందరు అయితే కొరటాల సినిమాలు అన్నీ ఇలానే ఉంటాయి అని సరిపెట్టుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా చూసిన మన స్టార్ డైరెక్టర్ వర్మ ఈ సినిమా పై పొగడ్తల వర్షం కురిపించడమే కాకుండా దాదాపుగా ఈ సినిమా పేరు చెపుకుని ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ పెద్దాయన కన్నా సూపర్ అని చెప్పేసాడు…ఇంతకీ వర్మ ఏమన్నాడు అంటే…నిన్న రాత్రి ఎన్టీఆర్ మూవీ ‘జనతా గ్యారేజ్’ చూశా. సీనియర్ ఎన్టీఆర్ లాగా కేవలం మాస్ చుట్టూనే తిరగకుండా తన పరిధిని జూనియర్ ఎన్టీఆర్ బాగా విస్తరిస్తున్నాడు…క్లాస్ ఆడియన్స్ లోకి చొచ్చుకెళ్తున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ లాగా పాత దారిలో ఉన్న ఎన్టీఆర్ ను ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ద్వారా కొత్త దారి వైపు మళ్లించాడు సుకుమార్. ఆ ప్రభావం ‘జనతా గ్యారేజ్’లో బాగా కనిపించింది’’ అని వర్మ తన ట్విటర్ లో పెట్టాడు… ఎన్టీఆర్ క్లాస్ లోకి చొచ్చుకు వెళ్ళడం నిజమే కానీ….ఏకంగా పెద్దాయాన్ని దాటేస్తున్నాడు అంటేనే ఎవ్వరూ ఒప్పుకోరు వర్మ…