యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్ లో బాల రామాయణం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా 1996 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ కాగా ఈ సినిమా రిలీజై నేటికి 25 సంవత్సరాలు కావడం గమనార్హం. బాల రామాయణం సినిమాకు జాతీయ అవార్డ్ రాగా నటుడిగా ఆ సినిమా ఎన్టీఆర్ కు మంచిపేరు తెచ్చిపెట్టింది.
ఈ సినిమా షూటింగ్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన అల్లరి అంతాఇంతా కాదు. గుణశేఖర్ ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ ను తిట్టగా ఎన్టీఆర్ అలిగి షూటింగ్ నుంచి వెళ్లిపోయారు. పైకి అమాయకంగా కనిపించే ఎన్టీఆర్ బాల రామాయణం షూటింగ్ సమయంలో ఎన్నో చిలిపి పనులు చేశారని ఆ సినిమా దర్శకనిర్మాతలు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో సీత పాత్రలో స్మితా మాధవ్ నటించారు.
ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ సమయంలో బాణాలను విరగ్గొట్టడం, వానర సైన్యం తోకలు లాగడం, మూతులు పీకడం, వారన సైన్యాన్ని బాణాలతో గుచ్చడం లాంటి పనులు చేశారు. బాల్యంలోనే పౌరాణిక పాత్రల్లో నటించి నటనతో మెప్పించిన ఎన్టీఆర్ ప్రస్తుతం ఎలాంటి పాత్రలో నటించినా తన నటనతో మెప్పిస్తూ ఘనవిజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఎన్టీఅర్ కు తక్కువ సమయంలో స్టార్ హీరోగా గుర్తింపును తెచ్చిపెట్టాయి.
వైవీఎస్ చౌదరి డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా నటించి విడుదలైన యువరాజు సినిమా విడుదలై నేటికి 21 సంవత్సరాలు అవుతోంది. యువరాజు బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచినా నటుడిగా మహేష్ బాబుకు మంచి పేరు తెచ్చిపెట్టింది.