యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) , కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర (Devara) సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా పుష్ప2 (Pushpa2) , ఓజీ (OG) సినిమాలు వాయిదా పడటం దేవరకు ఎంతో ప్లస్ అవుతోంది. ఈ నెల 27వ తేదీన కల్కి (Kalki) రిలీజ్ కానుండగా ఈ సినిమా తర్వాత ఆ స్థాయి సినిమా ఏదనే ప్రశ్నకు దేవర పేరు సమాధానంగా వినిపిస్తోంది. దసరా కానుకగా రిలీజ్ కానుండటం దేవరకు మరింత ప్లస్ అవుతోంది.
టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాత దేవర తెలుగు రాష్ట్రాల హక్కులను సొంతం చేసుకోగా పుష్ప2 వాయిదా తర్వాత దేవర రైట్స్ కు డిమాండ్ పెరుగుతోందని తెలుస్తోంది. దేవర మాస్ సినిమా కావడంతో సీడెడ్ లో ఈ సినిమా రైట్స్ కోసం గట్టి పోటీ నెలకొందని సమాచారం అందుతోంది. ఆంధ్ర హక్కులు 50 నుంచి 55 కోట్ల రూపాయల రేంజ్ లో సీడెడ్ 23 కోట్ల రూపాయల రేంజ్ లో నైజాం 45 కోట్ల రూపాయల రేంజ్ లో చెబుతున్నట్టు తెలుస్తోంది.
దేవర సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు 125 కోట్ల రూపాయలకు అటూఇటుగా అమ్ముడయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి (Rajamouli) సెంటిమెంట్ ను దేవరతో బ్రేక్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర సినిమా సెకండ్ పార్ట్ అప్ డేట్ కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవర సినిమా ష్యూర్ షాట్ హిట్ అని జూనియర్ ఎన్టీఆర్ సైతం చెబుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ జులై నెలాఖరు నాటికి దేవర సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేవర సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్ కు అదిరిపోయే రెస్పాన్స్ రాగా త్వరలో సెకండ్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ సినిమాకు యాక్షన్ సీన్స్ హైలెట్ గా నిలవనున్నాయని సమాచారం అందుతోంది.