యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ గా ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. రోడ్డు ప్రమాదాలు తన జీవితాన్ని, తమ కుటుంబాన్ని ఎంతలా ప్రభావితం చేశాయో చెప్పుకొచ్చాడు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వార్షికోత్సవ సమావేశానికి ప్రత్యేక అతిథిగా హాజరైన ఎన్టీఆర్.. తమ కుటుంబంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
”ఓ నటుడిగా నేను ఇక్కడికి రాలేదు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కుటుంబసభ్యులను కోల్పోయిన ఓ పౌరుడిగా వచ్చాను” అంటూ తన స్పీచ్ మొదలుపెట్టిన ఎన్టీఆర్ ముందుగా తన అన్నయ్య జానకీరామ్ ను తలచుకున్నారు. అతడు చాలా జాగ్రత్తపరుడని.. చిన్నప్పుడు అప్పుడప్పుడు తను బైక్స్, కార్లు నిర్లక్ష్యంగా నడిపి ఉండొచ్చు కానీ తన అన్నయ్య మాత్రం చాలా జాగ్రత్తపరుడని.. అలాంటిది రాంగ్ రూట్ లో ట్రాక్టర్ రావడం వలన ఆయన మరణించాడని చెప్పారు.
ఇక తన తండ్రి హరికృష్ణ..33వేల కిలోమీటర్లు ఒక్క ప్రమాదం కూడా జరగకుండా తన తాతయ్య పర్యటనను పూర్తి చేశారని.. అలాంటి వ్యక్తి ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ రోడ్డు ప్రమాదానికి గురయ్యారని.. ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. వాహనాన్ని నడుపుతున్నప్పుడు తల్లితండ్రులను, భార్యపిల్లల్ని గుర్తుచేసుకోవాలని అఞ్ఞార్రు ఎన్టీఆర్. వాహనదారుడు బాధ్యతతో ఉన్నప్పుడు ప్రమాదాలు తగ్గుతాయని అన్నారు. కరోనాకి కూడా వాక్సిన్ ఉందని.. కానీ రోడ్డు ప్రమాదాల నుండి తప్పించుకోవడానికి ఎలాంటి వాక్సిన్ లు లేవని అన్నారు.