టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లనే విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీతో తారక్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కు రాజకీయాలంటే ఆసక్తి అనే సంగతి తెలిసిందే. 2009 సంవత్సరంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎన్టీఆర్ ఎంతో కష్టపడినా అప్పటికే ప్రజల్లో చంద్రబాబుపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉండటంతో 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
ఆ తర్వాత చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెట్టారు. అయితే టీడీపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలని కోరుకుంటున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ సేవలను వాడుకోవాలని మంతనాలు మొదలుపెట్టారు. కొంతమంది పారిశ్రామిక, సినీ దిగ్గజాలు ఎన్టీఆర్ టీడీపీలో యాక్టివ్ కావాలని చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. 2024 ఏపీ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ చక్రం తిప్పే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. ఎన్టీఆర్ మనస్సు మార్చే ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాల్సి ఉంది.
తాజాగా చంద్రబాబు వర్గానికి చెందిన 8 మంది ఎన్టీఆర్ తో భేటీ అయ్యారని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మరోవైపు ఎన్టీఆర్ త్వరలో కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.