యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సినిమాలలో కొన్ని సినిమాలు ఫ్లాపైనా ఆ సినిమాలు ఎన్టీఆర్ అభిమానులను ఎంతగానో మెప్పించాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీపై కూడా ఫోకస్ పెట్టారు. తను హీరోగా నటించే ప్రతి సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రిలీజయ్యేలా తారక్ కెరీర్ ప్లానింగ్ ఉంది. అయితే తారక్ కు ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో అభిమానులు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన అశోక్ (Ashok) , ఊసరవెల్లి (Oosaravelli), బాద్ షా (Baadshah) సినిమాలు హిందీలో డబ్ అయ్యి అక్కడి యూట్యూబ్ ఛానెళ్లలో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన పలు హిట్ సినిమాలు సైతం హిందీలో డబ్ అయ్యి అక్కడ మంచి రెస్పాన్స్ ను అందుకోవడం గమనార్హం. ఎన్టీఆర్ దేవర (Devara) హిందీలో ఏకంగా 400 థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీపై కూడా ఫోకస్ పెడుతూ అక్కడ మార్కెట్ ను మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పారితోషికం పరంగా కూడా టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ తన డ్యాన్సింగ్ స్కిల్స్ తో బాలీవుడ్ అభిమానుల మెప్పు పొందారని సమాచారం అందుతోంది. తారక్ నటిస్తున్న వార్2 మూవీ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్ట్రెయిట్ మూవీగా తెరకెక్కుతోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా హిందీ రైట్స్ కోసం గట్టి పోటీ నెలకొందని సమాచారం అందుతోంది.
సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఈ సినిమాలో నటించడం ఈ సినిమాకు మరింత ప్లస్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఉండనుందని సమాచారం అందుతోంది. దేవర సినిమా ఓవర్సీస్ రైట్స్ 27 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని భోగట్టా.