యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) దేవర (Devara) సినిమా షూటింగ్ ను దాదాపుగా పూర్తి చేసినట్టేనని తెలుస్తోంది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ సమయానికే ఈ సినిమా ఫస్ట్ కాపీ సిద్ధమయ్యేలా మేకర్స్ ప్లాన్ ఉందని భోగట్టా. సెప్టెంబర్ నెల 27వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండటం గమనార్హం. అయితే తారక్ కొత్త లుక్ ప్రస్తుతం వైరల్ అవుతుండగా తారక్ లుక్ సూపర్ లుక్ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Jr NTR
కన్నడ డైలాగ్ రైటర్ వరదరాజ్ తో తారక్ దిగిన ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ అవుతున్నారు. తారక్ స్లిమ్ లుక్ లో బాగున్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. యంగ్ టైగర్ తన లుక్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తారక్ కెరీర్ ప్లాన్స్ సైతం అద్భుతంగా ఉన్నాయి. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమా కోసమే తారక్ లుక్ మార్చారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న తారక్ 2025 తర్వాతే కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న తారక్ ఈ సినిమాలతో ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ సినిమాలన్నీ సొంత బ్యానర్ లో తెరకెక్కుతుండటంతో రెమ్యునరేషన్ విషయంలో సైతం ఒకింత కన్ఫ్యూజన్ కొనసాగుతోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న తారక్ ఇతర భాషల్లో సైతం ఎదిగే దిశగా అడుగులు వేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అద్భుతమైన కథలను ఎంచుకుంటూ ఇతర యంగ్ హీరోలకు సైతం స్పూర్తిగా నిలుస్తున్నారు. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న తారక్ తన సినిమాలలో బాలీవుడ్ హీరోయిన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తారక్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.