రాజమౌళి- రాంచరణ్- ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం జపాన్ లో కూడా రిలీజ్ కాబోతుంది. దీంతో ప్రమోషన్ల కోసం చిత్ర బృందం అక్కడికి పయనమైంది. ఆల్రెడీ టీం అక్కడ లాండ్ అయిపోయారు కూడా..! జపాన్ ఎయిర్ పోర్ట్ లో రాంచరణ్, ఎన్టీఆర్ లు సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో వీళ్ళ లుక్స్ ఎలా ఉండేవో.. ఇప్పుడు ఎలా మారాయో మనం గమనించవచ్చు.
ఎన్టీఆర్ తో పాటు అతని ఫ్యామిలీ, అలాగే రాంచరణ్ తో పాటు అతని సతీమణి ఉపాసన కూడా జపాన్ ఫ్లైట్ ఎక్కారు. ఎయిర్పోర్ట్ లో ఉన్న ఈ హీరోల అభిమానులు తమ సెల్ఫ్ ఫోన్లతో క్లిక్కుమనిపించడంతో సోషల్ మీడియాలో ప్రత్యక్షమై వైరల్ అయిపోతున్నాయి. అక్టోబర్ 21న ‘ఆర్.ఆర్.ఆర్’ జపాన్ లో రిలీజ్ కాబోతుంది. జపాన్ లో రాంచరణ్ కు ఎలా ఉన్నా ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇక రాజమౌళి సినిమాలకు అక్కడ ఎలాగూ భారీ డిమాండ్ ఏర్పడింది.
ఇందుకే చిత్ర బృందం ప్రమోషన్ల నిమిత్తం అక్కడ వాలిపోయింది.ఈ ఏడాది మార్చి 25న రిలీజ్ అయిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టాయి. ఈ ఏడాదికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎన్టీఆర్ ఈ చిత్రంలో కొమరం భీమ్ గా, రాంచరణ్.. అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా నటించారు. ఈ చిత్రంతో వాళ్ళు దేశవిదేశాల్లో కూడా క్రేజ్ ను సంపాదించుకున్నారు. సరే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎన్టీఆర్, చరణ్ ల ఎయిర్ పోర్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :