యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ‘బాల రామాయణం’ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అటు తర్వాత.. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో హీరోగా మారాడు ఎన్టీఆర్. మొదటి సినిమా సో సోగా ఆడినా.. అటు తర్వాత వచ్చిన ‘స్టూడెంట్ నెంబర్ 1’ ‘ఆది’ ‘సింహాద్రి’ వంటి చిత్రాలతో తిరుగులేని స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ కెరీర్లో చాలా హిట్లు వచ్చాయి.. కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కాకపోవడం వల్ల అవి హిట్లుగా కనిపించలేదు.
అయితే ‘జనతా గ్యారేజ్’ చిత్రం సూపర్ హిట్ కాగా ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు ఎన్టీఆర్. ఇక ఫ్యామిలీ లైఫ్ పరంగా చూసుకుంటే.. ఎన్టీఆర్ తన తల్లి, భార్య, పిల్లలతో లైఫ్ హ్యాపీగా గడుపుతున్నాడు. తన అన్న కళ్యాణ్ రామ్ కు అండగా నిలబడుతున్నాడు ఎన్టీఆర్. ఇక ఇండస్ట్రీలో అతనికి చాలా మంచి స్నేహితులు ఉన్నారు. ఇదంతా అలా పెడితే.. ఒకప్పటి ఎన్టీఆర్ కొంచెం వేరు. ఇది మేము చెబుతున్న మాట కాదు..
గతంలో ఎన్టీఆర్ (Jr NTR) ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 23 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ ఓ హీరోయిన్ పై మనసు పడ్డాడట. క్రష్ ఫీలింగ్ ఆ అమ్మాయి పై పండిందని కూడా ఎన్టీఆర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అయితే పాసింగ్ ఫేస్ అని.. దాని వల్ల అతనికి ఎలాంటి ఇబ్బంది కలగలేదని ఎన్టీఆర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అలాగే ఇంటర్మీడియట్లో చేసిన కోతి వేషాలు అన్నీ ఇన్నీ కాదు అని కూడా ఎన్టీఆర్ తెలిపాడు.
ప్రతి ఒక్కరి లైఫ్ లో అలాంటి.. సందర్భాలు కామన్ అని ఎన్టీఆర్ చెప్పాడు. ఇక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక పూర్తిగా సినిమా తప్ప వేరే ధ్యాస లేదని.. పెళ్లయ్యాక పర్సనల్ లైఫ్ ను ప్రొఫెషనల్ లైఫ్ ను పక్క పక్కనే పెట్టి.. చూడలేదని.. ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చేశాడు. షూటింగ్ టైంలో ఏమాత్రం గ్యాప్ దొరికినా ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి ఫారెన్ టూర్లు వేస్తుంటాడన్న సంగతి తెలిసిందే..!