టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఎన్టీఆర్ సినీ అభిమానులతో పాటు టీడీపీ వీరాభిమానులు కోరుకుంటున్న సంగతి తెలిసిందే. ఏపీలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకు బలహీనపడుతోంది. ఇప్పట్లో పార్టీ బలపడే అవకాశం లేదు. రాష్ట్రంలో వైసీపీ సంక్షేమ పథకాల అమలు ద్వారా రోజురోజుకు బలపడుతోంది. అయితే ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై కొరటాల శివ మూవీతో స్పష్టతనివ్వనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.
ఇప్పటికే కొరటాల శివ ఎన్టీఆర్ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించబోతున్నానని స్పష్టతనిచ్చారు. మే 20వ తేదీన తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కొరటాల శివ తన సినిమాలో మెసేజ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తో తెరకెక్కించబోయే సినిమాలో రాజకీయాలకు విద్యార్థులు ఎలా బలవుతున్నారనే విషయాన్ని ప్రధానంగా కొరటాల శివ చూపించబోతున్నారని సమాచారం.
ఎన్టీఆర్ నటించిన నాగ సినిమాకు పని చేసిన ఒక వ్యక్తి ఎన్టీఆర్ నాగ సినిమా షూటింగ్ సమయంలోనే రాజకీయాల గురించి మాట్లాడేవారని చెప్పారు. భవిష్యత్తులో సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వెళతానని ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్ చేసినట్లు ఆ వ్యక్తి వెల్లడించారు. భవిష్యత్తులో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే సినిమాలకు దూరమవుతారో లేక సినిమాల్లో కొనసాగుతారో చూడాల్సి ఉంది.