“సాహో” కంటే ముందే విజయ్ దేవరకొండ తన “డియర్ కామ్రేడ్” చిత్రాన్ని నాలుగు భాషల్లో విడుదల చేసి తెలుగులో అలా ఒకేసారి నాలుగు భాషల్లో తన సినిమాను రూపొందింపజేసి విడుదల చేసిన మొదటి హీరోగా రికార్డ్ సాధించినప్పటికీ.. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఇక రీసెంట్ గా ప్రభాస్ కూడా “సాహో”తో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో సినిమాను విడుదల చేసినప్పటికీ.. కేవలం తెలుగు, హిందీ వెర్షన్స్ కు మాత్రమే ఓన్ డబ్బింగ్ చెప్పుకొన్నాడు. మిగతా భాషల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్స్ చెప్పారు.
అయితే.. త్వరలోనే “ఆర్ ఆర్ ఆర్” చిత్రంతో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ ప్రేక్షకుల్ని ఒకేసారి పలకరించనున్న ఎన్టీఆర్ మాత్రం డబ్బింగ్ గొంతుతో కాక అన్నీ భాషల్లోనూ తానే డబ్బింగ్ చెప్పాలనుకొంటున్నాడట. ఒకేసారి నాలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పడం అంటే మామూలు విషయం కాదు. అందుకే తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ట్రయినింగ్ మొదలెట్టాడట ఎన్టీఆర్. మరి ఎన్టీఆర్ సృష్టించబోతే ఈ రేర్ ఫీట్ ను భవిష్యత్ లో ఏ హీరో అయినా కనీసం ప్రయత్నించగలడో లేదో చూడాలి. ఎందుకంటే.. ఎన్టీఆర్ రేంజ్ డెడికేటెడ్ ఆర్టిస్ట్ ప్రస్తుతం తెలుగులో లేడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి.