Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు కాళ్లు పట్టుకున్నాడో విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

నటుడు రవి వర్మ సినిమాల్లోకి రాకముందు వృత్తిరీత్యా అమెరికా లో మాస్టర్స్ పూర్తి చేసి ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఉద్యోగిగా పనిచేసేవాడు. సినిమాలపై ఆసక్తితో ఉద్యోగం వదలేశారు.. అయితే సినిమాలు అంటే మొదటి నుండి విపరీతమైన ఇష్టమున్న రవి వర్మ అమెరికా లోనే యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో కోర్స్ పూర్తి చేసి ‘వెన్నెల’ సినిమాలో అవకాశం సంపాదించాడు. ఈ అనే సినిమా లో సయ్యద్ అనే పాత్ర ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్న ఆ రవివర్.

ఆ సినిమా లో ఆయన పాత్రకి మంచి గుర్తింపు రావడం తో వరుసగా పెద్ద హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసాడు. ఇండస్ట్రీ లో ఎంతో మంది క్యారక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు, కానీ కొందరిని మాత్రమే మనం గుర్తించుకోగలం. వాళ్ళ పేర్లు తెలియకపోయిన కూడా , యాక్టింగ్ ని ఎంజాయ్ చేస్తాము, బయట ఎక్కడైనా చూడగానే గుర్తు పట్టేస్తాము. అలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులలో ఒకరు రవి వర్మ. అయితే 2006 వ సంవత్సరం లో ఈయన ఏకంగా మూడు పెద్ద సినిమాల్లో నటించాడు.

అందులో ఎన్టీఆర్ రాఖీ , మహేష్ బాబు సైనికుడు మరియు సిద్దార్థ్ బొమ్మరిల్లు వంటి సినిమాలు ఉన్నాయి.ఎన్టీఆర్ తో రాఖీ సినిమా చేస్తున్న సమయం లో ఆయనతో వర్కింగ్ అనుభూతిని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నాడు రవివర్మ. ఆయన మాట్లాడుతూ ‘రాఖీ సినిమాలో నేను ఎన్టీఆర్ చెల్లి భర్తగా నటించాను. ఇందులో ఒక సన్నివేశం లో ఎన్టీఆర్ నా కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతాడు.

ఈ షాట్ గురించి నేను (Jr NTR) ఎన్టీఆర్ కి చెప్పగా, నేను నీ కాళ్ళు పట్టుకోవాల్నా?, బయటకి రా చెప్తా నీ పని అని ఆటపట్టించాడు. అప్పుడు నేను నాకేమి సంబంధం లేదు, కృష్ణ వంశీ గారు ఈ షాట్ ని పెట్టారు. ఆయనతో మాట్లాడి ఈ సన్నివేశం తీయించండి అని చెప్పాను’ అంటూ చెప్పుకొచ్చాడు రవి వర్మ. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus