డైరెక్టర్ త్రివిక్రమ్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్నారు. తీసింది కొద్ది సినిమాలే అయినా వాటిలో సూపర్ హిట్స్ మరియు బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఇక ఈ సంక్రాంతికి బన్నీతో ఆయన చేసిన అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకున్న ఈ చిత్రం టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో 3వ స్థానంలో నిలిచింది. అత్తారింటికి దారేది సినిమా తరువాత ఆ స్థాయి హిట్ త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో చిత్రంతో అందుకున్నాడు.
అందుకే ఎన్టీఆర్ తన కోసం ఎదురు చూస్తున్న సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్స్ ని కాదని త్రివిక్రమ్ కే అవకాశం ఇచ్చాడు.ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర కథపై అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యామిలీ డ్రామా, పొలిటికల్ థ్రిల్లర్, యాక్షన్ డ్రామా అంటూ అనేక కథలు వినిపిస్తున్నాయి. కథ ఏమైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కావలసిన అన్ని అంశాలు కలగలిపి ఈ చిత్రం త్రివిక్రమ్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఐతే ఈ మూవీతో త్రివిక్రమ్ పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వాలని స్కెచ్ వేస్తున్నాడట.
పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వడానికి ఎన్టీఆర్ బెస్ట్ ఛాయిస్ అని ఆయన భావనట. అందుకోసం ఆయన స్క్రిప్ట్ మరియు క్యాస్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎటూ ఎన్టీఆర్ కి పాన్ ఇండియా ఇమేజ్ రావడం ఖాయం. కాబట్టి త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా మూవీగా విడుదల చేయాలనే యోచనలో ఉన్నారట. ఐతే అది ఆర్ ఆర్ ఆర్ అక్కడ విజయం సాధిస్తేనే అని కండిషన్ కూడా ఉందట. కాబట్టి త్రివిక్రమ్ పాన్ ఇండియా ఎంట్రీ రాజమౌళి డిసైడ్ చేయాలి.