Pranathi: జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి స్టైలిష్ డ్రెస్, హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ ఎంతంటే..?

తెలుగు ఇండస్ట్రీ ఈ జెనరేషన్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. RRR మూవీతో గ్లోబల్ స్టార్ అయిపోయిన తారక్.. ‘కొమరం భీముడో’ పాటలోని నటన, హావభావాలతో ప్రపంచ సినీ ప్రియులను ఆకట్టుకున్నాడు.. తను సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాడు.. ఎప్పుడో ఒకసారి ఏదైనా స్పెషల్ అకేషన్ సందర్భంగా పోస్ట్ లేదా స్టోరీ పెట్టడం చేస్తుంటాడు.. మొన్న తన ఇద్దరు పిల్లలకు బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ దుస్తులు పంపగా.. థ్యాంక్స్ చెప్తూ త్వరలో తనకు కూడా అలాంటి బ్యాగ్ వస్తుందని ఆశిస్తున్నానంటూ స్టోరీ పెట్టాడు..

మార్చి 26న తన సతీమణి నందమూరి లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు సందర్భంగా.. ప్రేమ పూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ బ్యూటిఫుల్ పిక్ షేర్ చేయగా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.. తారక్ వర్క్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. కాస్త ఖాళీ సమయం దొరకితే చాలు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాడు.. టాలీవుడ్ యంగ్ సెలబ్రిటీలకు సంబంధించి.. అల్లు అర్జున్ వైఫ్ స్నేహా రెడ్డి, మహేష్ భార్య నమ్రత, రామ్ చరణ్ సతీమణి ఉపాసనల పర్సనల్ లైఫ్ గురించిన వార్తలు నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి..

వాళ్ల లివింగ్ స్టైల్, స్టార్ కిడ్స్‌ పిక్స్, వీడియోస్ వంటివి కూడా వైరల్ అవుతుంటాయి.. అయితే లక్ష్మీ ప్రణతి (Pranathi) గురించిన వివరాలు ఎక్కువగా తెలియవు.. ఫ్యామిలీ ఫంక్షన్స్, భర్త, పిల్లలతో బయటకు వెళ్లినప్పుడు తప్ప ఎక్కడా పెద్దగా కనిపించారామె.. సాధారణంగా ఆమె లైఫ్ స్టైల్ గురించి కూడా పెద్దగా బయటకి రాకపోయినా.. నెటిజన్లు ఓ హ్యాండ్ బ్యాగ్, డ్రెస్ విషయంలో మాత్రం చాలా ఆశ్చర్యపోతున్నారు.. అంతటి లగ్జరీ లైఫ్ స్టైల్ మెయింటెన్ చేస్తూ చాలా సింపుల్‌గా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు..

ప్రణతి హ్యాండ్ బ్యాగ్.. Louis Vuitton – Petite Malle : కాస్ట్ – రూ. 3,28,154/-.. అలాగే ఆమె ధరించిన డ్రెస్.. Anushree Reddy – Florian Brown Front Knotted Kaftan (in Crepe with a Snake Print. An easy summer outfit with a slit) : కాస్ట్ – రూ. 43,900/-..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus