యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) దేవర (Devara) సినిమా ఏప్రిల్ 5వ తేదీని మిస్ చేసుకోవడం వల్ల ఆ సినిమాకు కొంతమేర నష్టమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర ఇప్పుడు విడుదలై ఉంటే మూడు వారాల పాటు కలెక్షన్ల పరంగా ఢోకా ఉండేది కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) గాయం వల్ల ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల కావడం లేదనే సంగతి తెలిసిందే. దసరా పండుగ కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది.
అయితే తమిళంలో మాత్రం ఈ సినిమాకు గట్టి పోటీ ఎదురుకానుందని తెలుస్తోంది. రజనీకాంత్ (Rajinikanth) నటిస్తున్న వేట్టయాన్ సినిమా, అజిత్ (Ajith) నటిస్తున్న ఒక సినిమా దసరా పండుగ కానుకగా విడుదల కానున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాల వల్ల తమిళంలో దేవర కలెక్షన్ల విషయంలో నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) , సైఫ్ అలీ ఖాన్ నటించడం వల్ల బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా దేవర సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడ్డాయి.
జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ మొదలుకానున్నాయని సమాచారం అందుతోంది. దేవర సినిమాకు అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారని ఈ సినిమా బీజీఎం విషయంలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. దేవర సినిమా నుంచి వచ్చే ప్రతి అప్ డేట్ భారీ స్థాయిలో ఉండేలా మేకర్స్ ప్లానింగ్ ఉంది. అనిరుధ్ (Anirudh Ravichander) వర్క్ చేయడం వల్ల ఈ సినిమాకు బిజినెస్ మరింత ఎక్కువ స్థాయిలో జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
దేవర సినిమా రిలీజ్ కు ముందే బిజినెస్ పరంగా అదరగొడుతుండగా ఈ సినిమా బాక్సాఫీస్ రేంజ్ ఎలా ఉండనుందో చూడాల్సి ఉంది. దేవర సినిమా ఎన్టీఆర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చేలా ఉండనుందని తెలుస్తోంది. దేవర2 సినిమాపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.