యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలు చూసే వారిలో మాస్ ప్రేక్షకులు ఎక్కువ. అందుకే అతను యాక్షన్ కథలను ఎంచుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయినా ఆ కథలకు తగినట్లు మేకోవర్ అయి మెప్పిస్తుంటారు. సినిమాకు సినిమాకు లుక్ మారుస్తూ ప్రతి సారి అందరితో అదుర్స్ అనిపించుకుంటున్నారు. తారక్ హీరో గా అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అభిమానులను ఆకట్టుకున్న లుక్ లపై ఫిల్మీ ఫోకస్.
నిన్ను చూడాలనితారక్ రెండు పదుల వయసు లోకి అడుగు పెట్టక ముందే నిన్ను చూడాలని సినిమాతో హీరో గా పరిచయమయ్యారు. ఇందులో నూనూగు మీసాలతో ఎన్టీఆర్ పక్కింటి అబ్బాయిలా కనిపిస్తారు. ఆ విధంగా కనిపించాలనే ఎలాంటి కసరత్తులు లేకుండా బయట ఎలా ఉంటాడో.. సినిమాలోనూ అంతే కనిపించారు. ఎటువంటి హడావుడి లేకుండా వచ్చిన అతని తేజస్సు, స్టైల్ అందరికీ నచ్చింది.
ఆదిహీరోగా నాలుగో సినిమాకే తారక్ ఎంతో నేర్చుకున్నారు. నటనలోనే కాదు డ్రస్ సెలక్షన్ లోను ప్రత్యేకత చూపించారు. మాస్ డైరక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది సినిమాలో లోపల టీ షర్ట్, పైన షర్ట్ తో ప్రథమార్ధంలో కనిపిస్తే, టీ షర్ట్ పైన కోట్ తో క్లైమాక్స్ లో అదరగొట్టారు. హెయిర్ స్టయిల్ కూడా అతని గ్లామర్ ని పెంచింది.
సింహాద్రియంగ్ టైగర్ ని టాప్ పొజిషన్లో కూర్చోపెట్టిన చిత్రం సింహాద్రి. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఇందులో తారక్ చాలా సింపుల్ డ్రస్సులో కనిపిస్తారు. మెడలో పులి గోరు, లూజ్ షర్ట్, పైన కండువా.. పక్కా పని వాడుగా ఉన్న చిన్న రామయ్యను చూసేందు జనాలు ఎగబడ్డారు. ఈ లుక్ తో మాస్ కి ఎన్టీఆర్ కనెక్ట్ అయ్యారు
రాఖీఇంట్లో ముద్దుగా పెరిగితే బొద్దుగా తయారయినట్లు ఎన్టీఆర్ రాఖీ చిత్రంలో కనిపిస్తారు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిల్క్ చొక్కాలు, జీన్స్ ఫ్యాన్ట్స్ తో తారక్ మాస్ లుక్ ని వదల్లేదు. సైడ్ పాపిట తీసి.. అమాయకుడిగా.. తిరగబడిన ఆవేశపరుడిగా కనిపించి ఆకట్టుకున్నారు.
కంత్రియమ దొంగ సినిమాతో తన ఆకారంలో పూర్తి మార్పు తీసుకొచ్చిన ఎన్టీఆర్.. ఆ తర్వాత నుంచి ఫ్యాషన్ ను ఫాలో అవడంలో ముందున్నారు. కంత్రి చిత్రం కోసం మరింత స్లిమ్ అయి ఫుల్ హ్యాడ్ చెక్స్ షర్ట్, దానిపైన హాఫ్ జాకెట్, చేతికి కర్చీఫ్ కట్టి తన స్టయిల్ ని జత చేసి నందమూరి తారక రామా రావు మనవడిని నిరూపించుకున్నారు.
దమ్ముఅప్పటివరకు వయసుకు తగినట్లు కనిపించిన ఎన్టీఆర్ బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన దమ్ము లో పెద్ద తరహాగా నటించారు. ఇందులో మీసం మెలితిప్పి హుందాగా కనిపించారు. చేతికి కడియం, వేళ్లకు ఉంగరాలు, తెల్ల షర్టు వేసుకుని రౌడీలను తరుముతుంటే అభిమానులకు చూసేందుకు రెండు కళ్లు సరిపోలేదు.
బాద్ షాతారక్ డాన్ గా చేసిన చిత్రం బాద్ షా. ఇందులో హెయిర్ స్టయిల్ నుంచి షూ వరకు ఎన్టీఆర్ మార్చేశారు. నుదురు పైన వాలి పోయే జుట్టు, ఫ్రెంచ్ గడ్డం, కళ్ళజోడు, ప్రత్యేకంగా డిజైన్ చేసిన కోట్ తో హై ఎండ్ స్టయిల్ తో కనిపించారు. ఈ లుక్ లో యంగ్ టైగర్ బాలీవుడ్ బాద్ షా లను మించిపోయారు.
టెంపర్బాడీ తో ప్రయోగాలు చేసుకుంటూ వస్తున్నఎన్టీఆర్ టెంపర్ కోసం మరింత మారారు. దర్శకుడు పూరి జగన్నాథ్ సలహా మేరకు సిక్స్ ప్యాక్ రప్పించారు. డ్రస్సింగ్ లోను కేర్ తీసుకున్నారు. ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసినా, దాన్ని మోచేతి కింద వరకు మడవడం స్పెషల్. డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్ గా తన లుక్ తో కేక పుట్టించారు.
నాన్నకు ప్రేమతోదర్శకుడు సుకుమార్ ఎన్టీఆర్ రిచ్ క్లాస్ లుక్ లో చూపించారు. నాన్నకు ప్రేమతో సినిమా కోసం తారక్ హెయిర్ స్టయిల్ మార్చి, ఎక్కువగా గడ్డం పెంచి కనిపించారు. ఈ స్టయిల్ కి యూత్ అట్రాక్ట్ అయిపోయారు. ఆ సినిమాలో పాట మాదిరిగా ఆ లుక్ ని ఫాలో అయిపోయారు. డ్రస్ కొత్తదనం చూపించారు. టక్, టై, వేసుకొని లండన్ వాసిగా మతిపోగొట్టారు. హాలీవుడ్ హీరోలా మెరిసిపోయారు.
జనతా గ్యారేజ్సెప్టెంబర్ 2 న రిలీజ్ కానున్న జనతా గ్యారేజ్ మూవీ లో ఎన్టీఆర్ కనిపిస్తున్న విధానం చూస్తే క్లాసా, మాసా అని క్లారిటీ రాలేక పోతున్నారు. అందుకే ఫ్యాషన్ నిపుణులు తారక్ మేకోవర్ కి “మాస్ కోటెడ్ క్లాస్ లుక్” అని పేరు పెట్టేసారు. సినిమా విడుదలకు ముందే విపరీతంగా ఆకట్టుకున్న యంగ్ టైగర్ లుక్, రిలీజ్ అయినా తర్వాత ఎంతమంది అభినందనలు అందుకుంటుందో చూడాలి.