జూలై ఆ ముగ్గురికీ చాలా కీలకం!

సమ్మర్ కి రిలీజ్ అవ్వాల్సిన చాలా సినిమాలు పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయి. మరోపక్క సరైన సినిమా లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఇప్పటికే పల్లెల్లో చాలా థియేటర్లు మూతపడ్డాయి. పెద్ద సినిమాలు వస్తే తప్ప వాటిని ఓపెన్ చేసే ఆలోచన లేదు అన్నట్టు థియేటర్ యాజమాన్యాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ సమ్మర్లో చాలా క్రేజీ సినిమాలు రిలీజ్ అవ్వాలి. అందులో చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర'(Vishwambhara), ప్రభాస్ (Prabhas) ‘ది రాజాసాబ్'(The Raja saab) , రవితేజ (Ravi Teja)  ‘మాస్ జాతర’ (Mass Jathara)  వంటివి రిలీజ్ కావాలి.

Star Heroes

కానీ సకాలంలో షూటింగ్ కంప్లీట్ అవ్వకపోవడం వంటి వివిధ కారణాల వల్ల సినిమాలు వాయిదా పడ్డాయి. ఈ సమ్మర్లో వాయిదా కొన్ని క్రేజీ సినిమాలు జూలైలో రిలీజ్ కానున్నాయి. అవే చిరంజీవి ‘విశ్వంభర’, రవితేజ ‘మాస్ జాతర’, నితిన్ (Nithiin) ‘తమ్ముడు'(Thammudu). ఈ 3 క్రేజీ సినిమాలు జూలై నెలలో రిలీజ్ కానున్నాయి. ముందుగా నితిన్ ‘తమ్ముడు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. జూలై 4న ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

తర్వాత అంటే జూలై 18న రవితేజ ‘మాస్ జాతర’ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక జూలై 24,25 తేదీల్లో చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ 3 క్రేజీ సినిమాలే. కంటెంట్ పరంగా మంచి మార్కులు వేయించుకుంటే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు వచ్చే అవకాశాలు ఎక్కువే ఉంటాయి. పైగా చిరంజీవి ‘భోళా శంకర్’ (Bhola Shankar) తో, నితిన్ ‘ఎక్స్ట్రా’ ‘రాబిన్ హుడ్’ (Robinhood) తో, రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) తో డిజాస్టర్లు చవి చూశారు.

ఇప్పుడు ఈ ముగ్గురూ (Star Heroes) కూడా కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన పరిస్థితి. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. గతంలో అంటే 2002 లో నితిన్ ‘జయం’ , చిరంజీవి ‘ఇంద్ర’ (Indra), రవితేజ ‘ఇడియట్’ (Idiot) వంటి సినిమాలు నెలల గ్యాప్లో రిలీజ్ అయ్యి.. బ్లాక్ బస్టర్స్ కొట్టాయి. మరి అదే సెంటిమెంట్ 2025 లో కూడా రిపీట్ అవుతుందేమో చూడాలి.

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన గుత్తా జ్వాల!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus