‘క్రియేటివ్ కమర్షియల్స్’ బ్యానర్ ను స్థాపించి ‘అభిలాషా’ ‘ఛాలెంజ్’ వంటి సూపర్ హిట్ సినిమాలను మనకు అందించారు నిర్మాత కె.యస్.రామారావు గారు. ఈయన నిర్మాతగా టాప్ రేంజ్లో ఉన్నప్పుడు ఓ సినిమా ఈయన్ని చాలా పెద్ద దెబ్బ కొట్టింది. మధ్యలో ఈయన చేసిన కొన్ని సినిమాలు అంత హిట్ టాక్ తెచ్చుకోకపోయినప్పటికీ కమర్షియల్ గా ఓకె అనిపించాయి. కానీ ఆ సినిమా మాత్రం ఈయన ఇగోని రెచ్చగొట్టింది. ఆ సినిమా మరేదో కాదు ‘స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్’..!
ఇటీవల కె.యస్.రామారావు గారు ఈ చిత్రం గురించి మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. “నా బ్యానర్లో వరుస హిట్లు ఇస్తూ వస్తున్న టైం అది. అలాంటి టైములో ఎన్నో అంచనాల నడుమ ‘స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్’ చేశాను. ఫ్లాప్ అంటే ఏమిటో… దాని పెయిన్ ఎలా ఉంటుందో అప్పటివరకు నాకు తెలీదు.మెగాస్టార్ తో జర్నీ చేసాను కాబట్టి ‘స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్’ విషయంలో ఓ గుడ్డి నమ్మకంతో ముందుకు వెళ్ళిపోయాను.
అలా వెళ్ళిన నన్ను ఆ సినిమా ఫలితం కుదిపేసింది. దానికి రీజన్ ఆ సినిమా బాగాతీయకపోవడమో .. బాగా చేయకపోవడమో అని నేను అనుకోను. కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన సినిమా అది.’స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్’ అనేది రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల ఆధారంగా తెరకెక్కిన మూవీ.ఆ టైములో ఆయన కమర్షియల్ డైరెక్టర్ గా ఎదగలేదు. ఇవన్నీ ఆ చిత్రం చేదు ఫలితమివ్వడానికి కారణాలు అయ్యాయి.ఈ సినిమా ప్లాప్ అయ్యాక నా పై నాకే డౌట్ వచ్చింది.
నా జడ్జిమెంట్ ఎలా మిస్ అయ్యింది? మిస్టేక్ ఎక్కడ జరిగింది? నేను ఫ్లాప్ సినిమా తీసానా? అనే ఇగో నన్ను కదిలించింది. ఇండస్ట్రీలో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఏదో ఒకటి చేయాలి అనే కసి నాలో పెరిగిపోయింది.ఆ కసి పట్టుదలతోనే ‘చంటి’ చేశాను. దాని ఫలితం ఏంటో మీకు అందరికీ తెలుసు” అంటూ కె.ఎస్.రామారావు గారు చెప్పుకొచ్చారు.