తెలుగు సినిమా పతాకను దిగంతాలకు ఎగిరేలా చేసి, తన చిత్రాలతో తెలుగు సినిమాను ఆస్కార్ వరకు తీసుకెళ్లిన దర్శక దిగ్గజం కాశీనాధుని విశ్వనాథ్ ఆ విశ్వనాధుని సన్నిధికి చేరిపోయారు. ‘దొరకునా ఇటువంటి సేవ..నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము చేరు త్రోవ’ అంటూనే కదలి వెళ్లి పోయారు.. 92 సంవత్సరాల వయసులో వృద్దాప్య సమస్యల కారణంగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారాయన.
‘స్వాతిముత్యం’, ‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’, ‘స్వర్ణకమలం’, ‘శుభసంకల్పం’, ‘స్వయంకృషి, ‘ఆపద్భాందవుడు’ ఇలా ఎన్నో అపురూపమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. 1980 ఫిబ్రవరి 2న ‘శంకరాభరణం’ విడుదలైంది. సరిగ్గా అదేరోజు అంటే అదే ఫిబ్రవరి 2 వ తేదీ, 2023 న ‘కళాతపస్వి’ పరమపదించడం కాకతాళీయం.. కాగా.. లెజెండరీ సింగర్, ‘గాన గంధర్వుడు’ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం,
సాహిత్యపు పూదోటలో వికసించిన లెజెండరీ లిరిసిస్ట్ ‘సిరివెన్నెల’తో విశ్వనాథ్ కలిసున్న ఫోటోకు ‘కైలాసంలో త్రిమూర్తులు’ అనే అద్భుతమైన కొటేషన్ ఇచ్చి షేర్ చేసిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పిక్చర్ చూసి తెలుగు సినీ అభిమానులు, పరిశ్రమ ప్రముఖులు భావోద్వేగానికి గురవుతున్నారు. విశ్వనాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నివాళులర్పిస్తున్నారు.
2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!
షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?