Kajal: ఆ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది.. కాజల్ కామెంట్స్ వైరల్!

వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ గురించి పరిచయం అవసరం లేదు.తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఈమె అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో అగ్రతారగా గుర్తింపు సంపాదించుకున్నారు.ఇకపోతే ఇలా దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలలో నటించిన కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను వివాహం చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇక కరోనా సమయంలో వీరి వివాహం కావడంతో సినిమాలకు కూడా కాస్త బ్రేక్ పడింది.

అయితే ఈమె పెళ్లయిన కొన్ని నెలలకే ప్రెగ్నెంట్ కావడంతో పూర్తిగా సినీ ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చారు.ఇక ప్రస్తుతం కాజల్ అగర్వాల్ పండంటి కుమారుడికి జన్మనిచ్చిన తర్వాత పూర్తిగా తన కుమారుడి బాగోగులు చూసుకుంటూ తల్లిగా తన బాధ్యతలను నెరవేరుస్తున్నారు. ఇకపోతే తప్పనిసరి పరిస్థితులలో బయటకు వెళ్లిషూటింగ్స్ లో పాల్గొనాల్సి రావడంతో కాజల్ అగర్వాల్ ఆ సమయంలో తనకు కలిగిన భావనలను సోషల్ మీడియాలో తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు.

తన కుమారుడు జన్మించిన తర్వాత తనని వదిలి షూటింగ్ కి వెళ్లాలంటే ప్రాణం పోయినంత పని అయిందని బయటికి వెళ్లినా కానీ తన ఆలోచనలన్నీ తన నీల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయని కాజల్ వెల్లడించారు. ఇలా తన పనిలో పడి తన కుమారుడితో కేటాయించాల్సిన సమయం కేటాయించ లేకపోతున్నానని బాధపడ్డాను. నిజం చెప్పాలంటే తన కోసమే జిమ్ వెళ్లడం కూడా మానేశానని కాజల్ తెలిపారు.

అదేవిధంగా ప్రతి తల్లి తన బిడ్డకు పాలు పట్టాలని అనుకుంటుంది. అయితే తన బిడ్డ పాలు తాగే సమయంలో భరించలేని నొప్పి ఉన్నప్పటికీ ఆ సమయంలో కలిగే ఫీలింగ్ ఎంతో అద్భుతంగా ఉంటుందని తాను కూడా ఆ నొప్పిని భరించాను అయితే ఎంతో ప్రేమగా నొప్పిని భరించానని ఈ సందర్భంగా కాజల్ తన కొడుకుతో తనకున్న అనుబంధం గురించి ఈ సందర్భంగా వెల్లడించారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus