భారతీయ సినిమా చరిత్రలో ‘షోలే’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. అప్పటివరకు బాలీవుడ్ సినిమాను ఒక కోణంలో చూస్తే.. ఈ సినిమా తర్వాత మారింది అని చెప్పొచ్చు. అంతటి స్పెషల్ సినిమా కమల్ హాసన్‌కు నచ్చలేదట. ఈ విషయాన్ని ఇటీవల ఆయన చెప్పుకొచ్చారు. దాంతోపాటు మరికొన్ని ఆసక్తికర విషయాలు కూడా చెప్పుకొచ్చాడు. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా ప్రచారాన్ని కామికాన్‌లో నిర్వహించినప్పుడు ‘షోలే’ గురించి చెప్పారు.
కామికాన్ కోసం మూవీ టీమ్ అమెరికా వెళ్లింది. అయితే ఈ ఈవెంట్‌కు అమితాబ్ బచ్చన్ హాజరు కాలేదు. అయితే ఆయన ఆన్‌లైన్‌లో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్, కమల్ హసన్ మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కమల్ హాసన్ మాట్లాడుతూ అమితాబ్ బచ్చన్, ప్రభాస్ లాంటి గొప్పనటులతో పాటు ఇక్కడ ప్రేక్షకుల మధ్యలో కూర్చోవడం గొప్ప వరం అని అన్నాడు.
ఇంతలో అమితాబ్ కలుగజేసుకొని మీరు అంత నిరాడంబరంగా ఉండకండి (Kamal) కమల్… వాస్తవానికి మీరు మా అందరికంటే గొప్పవారు అని అన్నారు. కమల్ హాసన్ సినిమాలు రియాలిటీకి దగ్గరగా ఉంటాయని, ఆయన సినిమా కోసం ఎంత కష్టమైనా పడతారని చెప్పుకొచ్చారు. అంతేకాదు కమల్‌లా నటించడం కష్టమని కూడా వ్యాఖ్యానించారు. ‘షోలే’ సినిమా కోసం తాను పని చేసిన నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ‘షోలే’ సినిమాకు తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశానని చెప్పారు.
ఆ సినిమా చూసిన రోజు రాత్రి తాను అసలు నిద్రపోలేదని చెప్పారు. ఎందుకంటే ఆ సినిమాను చాలా ద్వేషించాను అని చెప్పారు. ఆ సినిమా తీసిన వ్యక్తిని మరింత ద్వేషించాను అని చెప్పారు. ‘షోలే’ సినిమా లాంటి చిత్రాలను అమితాబ్ ఎన్నో తీశారు. ఇప్పుడు అమితాబ్ తన సినిమాల గురించి గొప్పగా చెబుతారని, ఇలా మాట్లాడతారని ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు కమల్. అయితే ఆ సినిమాను ఎందుకు కమల్ ద్వేషించారు అనే విషయం చెప్పలేదు.