కమల్ హాసన్ (Kamal Haasan) – మణిరత్నం (Mani Ratnam) ఈ కాంబినేషన్ గురించి ప్రేక్షకులు 37 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడో ‘నాయగన్’ సినిమా తర్వాత ఈ ఇద్దరూ కలసి పని చేసింది లేదు. అయితే మూడేళ్ల క్రితమే ఈ కాంబో మిస్ అయ్యామని మీకు తెలుసా? ఓ పుకారులా ఆ రోజుల్లో వినిపించిన మాట ఇప్పుడు కమల్ హాసన్ క్లారిటీతో నిజమని తేలిపోయింది. మీకు గుర్తుండి ఉంటే 2002కి ముందు కమల్ – మణిరత్నం సినిమా గురించి వార్తలు వచ్చాయి.
‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan) సమయంలో ఈ వార్తలొచ్చాయి. ‘నాయగన్’ సినిమా లాంటి కల్ట్ పిక్చర్ తర్వాత ‘పొన్నియిన్ సెల్వన్’లో కమల్ (Kamal Hassan) – మణిరత్నం కలసి పని చేయొచ్చు అనే వార్తలొచ్చాయి. చాలా రోజుల పాటు ఆ సినిమా గురించి టీమ్ అంతా కలసి పని చేశారు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా ప్రాజెక్ట్ గురించి వార్తలు ఆగిపోయాయి. ఈ విషయం గురించి కమల్ హాసన్ తాజాగా చెప్పుకొచ్చారు.
మణిరత్నం కొన్నేళ్ల ముందు ఓ సినిమా ప్రతిపాదన చేశారని, సొంత నిర్మాణ సంస్థలో ఆ సినిమా చేయడానికి కథను కూడా కొన్నామని తెలిపారు. అయితే సినిమాకు అయ్యే బడ్జెట్ కోసం ప్రణాళికలు వేయగా బడ్జెట్ ఫైనల్ నెంబర్స్ చూసి భయపడ్డామని తెలిపారు. అంత బడ్జెట్‌తో సినిమా ఇప్పుడు వర్కవుట్ కాదని తేలి.. పూర్తిగా ప్రాజెక్ట్ నుండి వెనక్కి తప్పుకున్నామని కమల్ క్లారిటీ ఇచ్చారు. ఆ సినిమానే ‘పొన్నియిన్ సెల్వన్’ అని చెప్పారు.
అలా అప్పుడు మనం ఆ సినిమా మిస్ అయ్యాం. అలా మిస్ అయిన ప్రాజెక్ట్ ‘థగ్ లైఫ్’ (Thug Life) రూపంలో ఓకే అయింది. ఇప్పుడు ఆ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇక ‘పొన్నియిన్ సెల్వన్’ సంగతి చూస్తే.. తమిళ సినీ చరిత్రలోనే అత్యధికంగా రూ.600 కోట్లకు పైగా బడ్జెట్ రూపొందింది. వసూళ్లు కూడా ఆ స్థాయిలోనే అందుకుంది.