ఓటీటీలో ఇటీవల విడుదలైన ‘కాలా బార్బేరియన్ చాప్టర్ 1’ హిందీ చిత్రం మంచి ఆదరణను దక్కించుకుంటోంది. ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాలో కరీంనగర్ కుర్రాడు ప్రజ్ర్ఞన్ విలన్‌గా నటించటం విశేషం. ‘కాలా బార్బేరియన్ చాప్టర్ 1’లో సైకో పాతల్ర్లో ప్రజ్ర్ఞన్ అద్భుతంగా నటించారని పత్రికలు ఆర్టికల్స్ రూపంలో ప్రశంసించాయి. పస్ర్తుతం ప్రజ్ర్ఞన్ ఒక తెలుగు సినిమాలో కూడా విలన్ పాత్రలో నటిస్తున్నారు.
ఈ సందర్బంగా ప్రజ్ర్ఞన్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో చయనిక చౌదరితో కలిసి నేను నటించిన సన్ని వేశాలకు చక్కటి ప్రశంసలు వచ్చాయి. పూణే ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన పలువురు దర్శకులు ఫోన్ చేసి పశ్రంసించారు. అది నాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. అంతేకాకుండా నేను కొంతమంది దర్శకులకు ఈ సినిమా చూపించినప్పుడు చూసిన వెంటనేతెలుగు సినిమాలో ఒక ప్రముఖ హీరో సరసన అవకాశం ఇచ్చిన దర్శకుడు శ్రీని గారికి ధన్యవాదాలు .
మల్టీపుల్ డిజార్డర్ క్యారెక్టర్‌కి స్కోపున్న పాత్ర దొరికింది. ఒక మంచి నటుడికి ఇంత కంటే కావలసిందేముంది. పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్ కోర్సు ముగించుకోగానేఈ అవకాశం వచ్చింది. నా తొలి చిత్రానికే ఇంతటి పేరు రావడం నాకు చాలా ఆనందంగా వుంది’ ‘అని ఆయన అన్నా రు. జింటో చాకో శామ్యూల్ దర్శకత్వం వహించిన కాలా బార్బేరియన్ చిత్రంలో వరుణ్ సింగ్ రాజ్‌పుత్, స్తుతి త్రివేది జంటగా నటించారు. .