సినిమాలకి సీజీ (గ్రాఫిక్స్) ఎంత చాలా ముఖ్యం. మామూలు సినిమాల విషయంలో ఇది ఎలా వున్నా కొన్ని సినిమాలకి గ్రాఫిక్సే ప్రాణం. ఇలాంటి సినిమాలకి ‘బాహుబలి’ సినిమాతో ఓ బెంచ్ మార్క్ సెట్ చేశారు రాజమౌళి. అది మొదలు సీజీ కీలకంగా ఉన్న సినిమాలు బాహుబలిని కొలమానంగా భావించడం మొదలైంది. ‘సోగ్గాడే..’ సమయంలో నాగ్ కూడా మాట చెప్పారు. ఇప్పుడు కార్తీ కూడా ఇలానే భయపడుతున్నాడు.మూడు విభిన్న పాత్రల్లో కార్తీ నటించిన చిత్రం కాష్మోరా. గోకుల్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు వెర్షన్ పాటలు, ట్రైలర్ నిన్న విడుదలయ్యాయి.
ఈ కార్యక్రమంలో కార్తీ మాట్లాడుతూ రెండేళ్ల క్రితం ఈ కథ విన్నప్పుడే ఇదో పెద్ద సినిమా అవుతుందని అనిపించిందన్న కార్తీ మెజారిటీ షూటింగ్ జరిగాక ‘బాహుబలి’ విడుదలైందన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఈ స్థాయిలో మనం గ్రాఫిక్స్ చెయ్యగలమా అన్న భయం మొదలైందన్నారు. బాహుబలి డైనోసార్ లా ఉంటే కాష్మోరా కుక్కపిల్లలా ఉంటుందని వ్యాఖ్యానించిన కార్తీ ఈ సినిమాలో ‘మగధీర’లా ఓ ముప్పై నిమిషాలు మాత్రమే గ్రాఫిక్స్ ఉంటుందని చెప్పుకొచ్చాడు.ఇక ట్రైలర్ చూస్తుంటే వార్ ఎపిసోడ్స్, సైనిక దళ విన్యాసాలుబాహుబలి, రుద్రమదేవి వంటి సినిమాలను గుర్తు తెస్తున్నాయి. ఐతే ఈ సినిమాలో సీరియస్ తోపాటు ఎక్కువ శాతం కామెడీ ఉంటుందని కార్తీ అంటున్నాడు. పైగా ఇద్దరు హీరోయిన్లు ఉన్నా రొమాన్స్ ఉండదని కుండబద్దలు కొట్టేశాడు. కొన్నేళ్ల క్రితం యుగానికి ఒక్కడు సినిమాతో ఈ తరహా ప్రయోగం చేసిన కార్తీ మళ్ళీ ఇప్పుడు అలాంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఫలితమెలా ఉంటుందో..?