టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో కీర్తి సురేష్ కు (Keerthy Suresh) నటిగా మంచి గుర్తింపు ఉంది. మహానటి సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తుండగా ఆ సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయి. అయితే కీర్తి సురేష్ తాజాగా ఊహించని ఒక వివాదంలో చిక్కుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కంటే విజయ్ (Vijay Thalapathy) బెస్ట్ డ్యాన్సర్ అని ఈ బ్యూటీ కామెంట్లు చేశారు. రఘు తాత (Raghu ThaTha) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈ కామెంట్లు చేశారు.
అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం చిరంజీవి నటించిన సినిమాలను కీర్తి సురేష్ చూసి ఉండకపోవచ్చని అందుకే ఈ విధంగా కామెంట్లు చేసి ఉంటారని చెబుతున్నారు. విజయ్ గొప్ప డ్యాన్సర్ అని తాము కూడా అంగీకరిస్తామని అయితే చిరంజీవితో పోల్చి చూస్తే బెస్ట్ డ్యాన్సర్ అని మాత్రం చెప్పలేమని కామెంట్లు వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్ ఈ కామెంట్లపై రాబోయే రోజుల్లో వివరణ ఇస్తారేమో చూడాల్సి ఉంది. సాధారణంగా హీరోయిన్లు ఇలాంటి ప్రశ్నలు ఎదురైతే ఎవరినీ నొప్పించకుండా సమాధానాలు ఇవ్వడానికి ఇష్టపడతారు.
కీర్తి సురేష్ మాత్రం తన వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకుంటూ ఇబ్బందుల్లో పడుతున్నారు. మెగా ఫ్యాన్స్ నుంచి వస్తున్న ట్రోల్స్ వల్ల కీర్తి సురేష్ కెరీర్ పై కూడా ప్రభావం పడే ఛాన్స్ ఉంది. విజయ్ కు జోడీగా రెండు సినిమాలలో నటించిన కీర్తి సురేష్ భోళా శంకర్ (Bhola Shankar) సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా నటించారు.
విజయ్ ఏ కోణంలో బెస్ట్ డ్యాన్సర్ అని కీర్తి సురేష్ ఫీలయ్యారో చెప్పాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కీర్తి సురేష్ భవిష్యత్తులోనైనా ఇలాంటి విమర్శలకు తావివ్వకుండా జవాబులు చెప్పాల్సి ఉంది. హీరోల ఫ్యాన్స్ ను హర్ట్ చేసేలా కామెంట్స్ చేస్తే ఆమె కెరీర్ కే నష్టమని చెప్పవచ్చు.