Keerthy Suresh, Allu Arjun: బన్నీ బోయపాటి మూవీలో హీరోయిన్ ఈమేనా?

సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప మూవీపై భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 17వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. పుష్ప టీం ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ కు సంబంధించి వేగం చూపిస్తోంది. బన్నీ తర్వాత సినిమా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కనుందని తెలుస్తోంది. బోయపాటి శ్రీను ఇప్పటికే బన్నీ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారని సమాచారం.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ఎంపికయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం కీర్తి సురేష్ సర్కారు వారి పాట సినిమాలో మహేష్ కు జోడీగా, భోళాశంకర్ సినిమాలో చిరంజీవికి సిస్టర్ రోల్ లో నటిస్తున్నారు. కెరీర్ లో కీర్తి సురేష్ ఎక్కువగా క్లాస్ రోల్స్ లో నటించిన సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కీర్తి సురేష్ ను ఊరమాస్ రోల్ లో చూపించనున్నారని తెలుస్తోంది. బన్నీ కీర్తి సురేష్ కాంబోలో నిజంగా సినిమా వస్తుందో లేదో చూడాల్సి ఉంది.

ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సరైనోడు మూవీ తర్వాత బన్నీ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఇదే కావడం గమనార్హం. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కనుండగా బన్నీ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus