KGF2 Movie: మరో రికార్డ్ సృష్టించిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’

కన్నడ డబ్బింగ్ మూవీ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతూనే ఉంది. ‘ఆచార్య’ వంటి కొత్త సినిమా వచ్చినా.. ‘ఆర్.ఆర్.ఆర్’ ఇంకా రాణిస్తున్నా ఈ మూవీ ఇంతలా కలెక్ట్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం.అంతేకాకుండా ‘కె.జి.ఎఫ్2’ మరో రికార్డుని క్రియేట్ చేసింది. కన్నడ హీరో యష్ నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. ఈరోజు అడ్వాన్స్ బుకింగ్స్ తో ‘కె.జి.ఎఫ్2’ మూవీ ఆ ఫీట్ ను సాధించినట్టు స్పష్టమవుతుంది.

‘బాహుబలి2’ ‘దంగల్’ ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఇండియన్ మూవీస్ లో ఆ రికార్డ్ కొట్టిన మూవీ ఇదే కావడం విశేషం. అయితే కన్నడ చిత్రాల్లో ఆ ఫీట్ ను సాధించిన మూవీ ఇదే కావడం మరో విశేషం. ‘కె.జి.ఎఫ్2’ విడుదల రోజు నుండీ ఒక్కో రికార్డ్ ను కొడుతూ వస్తుంది. హిందీలో మొదటి రోజు రికార్డ్ వసూళ్లను రాబట్టి.. అక్కడి గత చిత్రాల కలెక్షన్లను అధిగమించింది. అమీర్ ఖాన్, ప్రభాస్,చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల తర్వాత యష్ కూడా రూ.1000 కోట్ల గ్రాస్ క్లబ్ మూవీని దక్కించుకున్నాడు.

‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ లతో అతని మార్కెట్ 10 రెట్లు పెరిగింది.ఇక ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ గ్రాస్ కలెక్షన్ల విషయానికి వస్తే…

హిందీ బెల్ట్  432.00 cr
కర్ణాటక  163.00 cr
ఏపీ/తెలంగాణ  141.00 cr
తమిళనాడు  89.00 cr
కేరళ  60.00 cr
ఓవర్సీస్ 177.00 cr
వరల్డ్ వైడ్ టోటల్  1062.00 cr

ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకుడు కాగా హోంబెల్ ఫిల్మ్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు.శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టండన్, సంజయ్ దత్, మరియు ప్రకాష్ రాజు, రావు రమేష్ వంటి వారు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus