Kabzaa Movie: ఉపేంద్ర సినిమాకి డిమాండ్ పెరుగుతుందా..?

‘కేజీఎఫ్’ సినిమా తరువాత శాండల్ వుడ్ రేంజ్ ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్ గా విడుదలైన ‘కాంతారా’ సినిమా కన్నడ సినిమాల క్రేజ్ ని మరింత పెంచింది. అందుకే అక్కడి నిర్మాతలు భారీ పాన్ ఇండియా సినిమాలు సెట్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ‘కబ్జా’ అనే సినిమాను తెరకెక్కించారు. కొన్నాళ్లక్రితం ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఇప్పటివరకు రిలీజ్ డేట్ ను ఫైనల్ చేయలేదు. ఉపేంద్ర, కిచ్చ సుదీప్ కాంబినేషన్ లో రూపొందిన ఈ మల్టీస్టారర్ సినిమాలో శ్రియ,

మనోజ్ బాజ్ పాయ్ ఇలా చాలా మంది పేరున్న నటీనటులు కీలకపాత్రలు పోషించారు. రవి బస్రూర్ లాంటి టాలెంటెడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాలో భాగమయ్యారు. ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించారు. 9కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన ఓ మాఫియా గ్యాంగ్ స్టర్ స్టోరీనే ఈ సినిమా. అయితే ఇప్పుడు ఈ సినిమాపై ‘కేజీఎఫ్’ ఎఫెక్ట్ చూపిస్తోంది. ‘కబ్జా’ సినిమా గ్రాండియర్, సెటప్, విజువల్స్, ఎలివేషన్స్ అన్నీ ‘కేజీఎఫ్’ సినిమానే తలపిస్తున్నాయి.

మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒకరే కావడంతో ఆ ఫీలింగ్ ఇంకా ఎక్కువైంది. దీంతో ‘కబ్జా’ నిర్మాతలు చెబుతున్న రేట్లకు బయ్యర్లు ముందుకు రావడం లేదు. వారు చెప్పిన రేట్లకు సినిమాను కొంటే నష్టాలొస్తాయేమోనని భయపడుతున్నారు. ఈ పోలిక గొడవ లేకపోతే ఉపేంద్ర, సుదీప్ లకు ఉన్న క్రేజ్ కి సినిమాను ఈజీగా భారీ రేట్లకు అమ్మేయొచ్చు.

కానీ ఈ సినిమా కోసం చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు. మొత్తం రికవరీ అవ్వాలంటే కన్నడతో పాటు మిగిలిన భాషల్లో కూడా మార్కెట్ జరగాలి. ఇంకా ఓటీటీ, డబ్బింగ్, శాటిలైట్ డీల్స్ కూడా పూర్తి కాలేదు. కానీ డిసెంబర్ లో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus