టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజులను పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో వేడుకను నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. ఈ వేడుకలో భాగంగా చిత్ర బృందం పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి సినిమాల గురించి మాత్రమే కాకుండా ఏపీ ప్రభుత్వంపై మాట్లాడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసారు అంటూ విమర్శలు చేశారు.
సినిమా ఇండస్ట్రీ పై పెట్టే ఫోకస్ రాష్ట్ర అభివృద్ధిపై పెట్టాలని సూచించారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఏంటి అంటూ ఏపీ ప్రభుత్వంపై ఈయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ కామెంట్లు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఏపీ ప్రభుత్వం గురించి ప్రభుత్వ పాలన గురించి చిరంజీవి మాట్లాడుతూ కామెంట్ చేయడంతో ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నాని రియాక్ట్ అయ్యారు. కొడాలి నాని మీడియా సమావేశంలో భాగంగా (Chiranjeevi) చిరు వ్యాఖ్యలపై స్పందిస్తూ తనకు భారీగా కౌంటర్ ఇచ్చారు.
ఈ సందర్భంగా కొడాలి నాని పరోక్షంగా చిరు వ్యాఖ్యలపై స్పందిస్తూ సినిమా ఇండస్ట్రీలో చాలామంది పకోడీగాళ్లు ఉంటారు. ప్రభుత్వం ఎలా ఉండాలో కూడా ఆ పకోడీగాళ్లు సలహా ఇస్తుంటారని సెటైర్లు వేశారు.ఇప్పటికే ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లు ప్రభుత్వం ఎలా ఉండాలో కూడా సలహాలు ఇస్తున్నారని, అలాంటివాళ్లు తమ వాళ్లకు (పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ) సలహాలు ఇస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలిపారు.
మనకెందుకురా బాబు ఈ రాజకీయాలు మనం పాటలు డాన్సులు ఫైట్లు చేసుకుందాం అంటూ వాళ్లకు కూడా సలహాలు ఇస్తే బాగుంటుందని ఈ సందర్భంగా నాని తెలిపారు.ఇలా చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై రియాక్ట్ అయినటువంటి నాని ఆయన కూడా చిరు వ్యాఖ్యలకు దీటుగానే కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం చిరంజీవి గురించి నాని చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి నాని చేసిన ఈ వ్యాఖ్యలపై చిరు నుంచి ఏదైనా రియాక్షన్ వస్తుందా లేక ఈ వివాదానికి ముగింపు పలుకుతారా అన్నది తెలియాల్సి ఉంది.