టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని కెరీర్ విషయంలో అంతకంతకూ ఎదుగుతున్న హీరోలలో చిరంజీవి ఒకరు. ఆరు పదుల వయస్సులో కూడా చిరంజీవి యాక్టివ్ గా ఉంటూ రీఎంట్రీలో సినిమాల ద్వారా ఎన్నో కమర్షియల్ విజయాలను ఖాతాలో వేసుకుంటున్నారనే సంగతి తెలిసిందే. చిరంజీవి వేగంగా సినిమాల్లో నటిస్తుండగా కొన్ని నెలల గ్యాప్ లోనే చిరంజీవి నటించిన మూడు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. అయితే చిరంజీవిని అవమానించేలా కోలీవుడ్ మీడియాలో కథనాలు ప్రచారంలోకి రావడం గమనార్హం.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ఆస్కార్ నుంచి పిలుపు అందగా సౌత్ ఇండియా నుంచి పిలుపు అందిన ఏకైక స్టార్ హీరో సూర్య అంటూ కోలీవుడ్ మీడియా ప్రచారం చేస్తోంది. అయితే అవార్డుల ప్రధానోత్సవానికి 1987లోనే చిరంజీవికి ఆస్కార్ నుంచి ఆహ్వానం అందింది. సౌత్ నుంచి ఈ విధంగా ఆహ్వానం అందుకున్న తొలి హీరో చిరంజీవి కావడం గమనార్హం. సూర్యకు సౌత్ నుంచి ఆస్కార్ మెంబర్ షిప్ అందుకున్న తొలి వ్యక్తిగా గుర్తింపు దక్కింది.
ఆస్కార్ ఆహ్వానితులు, ఆస్కార్ మెంబర్ షిప్ వేర్వేరు కాగా ఈ చిన్న తేడాను కోలీవుడ్ మీడియా మరిచిపోవడం గమనార్హం. గతంలోనే ఆస్కార్ నుంచి పిలుపు అందుకున్న చిరంజీవి పేరును అస్సలు ప్రస్తావించకుండా తమిళ స్టార్ హీరో సూర్య గురించి మాత్రమే కోలీవుడ్ మీడియా గొప్పగా ప్రస్తావిస్తోంది. మరోవైపు చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య 2023 సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుండగా గాడ్ ఫాదర్, భోళా శంకర్ రిలీజ్ డేట్లు ఫిక్స్ కావాల్సి ఉంది.
ఈ మూడు సినిమాలతో మెగాస్టార్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. చిరంజీవి ఒక్కో సినిమాకు 35 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.