సినిమా ఇండస్ట్రీలో ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే హీరో కంటే దర్శకుడిపైనే ఆ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో సోషల్ మీడియాలో కొంతమంది కొరటాల శివను సమర్థిస్తుంటే మరి కొందరు మాత్రం కొరటాల శివపై విమర్శలు చేస్తున్నారు. కథ, కథనం విషయంలో కొరటాల శివకు ఫ్రీడమ్ ఇవ్వలేదని అందువల్లే ఈ సినిమా అనుకున్న విధంగా స్క్రీన్ పై రాలేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే కథ విషయం పక్కనపెడితే డైలాగ్స్ విషయంలో మాత్రం కొరటాల శివను నిందించాల్సిందేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలకు కొరటాల శివ డైరెక్టర్ కాగా ఈ సినిమాలలో చాలా డైలాగ్స్ ప్రేక్షకులను ఆలోచించజేసే విధంగా ఉన్నాయి. అయితే ఆచార్యలో ట్రైలర్ లో ప్రేక్షకులను మెప్పించిన డైలాగ్స్ మినహా సినిమాలో మిగిలిన డైలాగ్స్ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. కొరటాల శివకు ఆచార్య సినిమాకు పని చేయడానికి ఇతర సినిమాలతో పోలిస్తే ఎక్కువ సమయం లభించింది. అయితే ఆ సమయాన్ని కొరటాల శివ మాత్రం సద్వినియోగం చేసుకోలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఆచార్య సినిమా చూసిన ప్రేక్షకులకు సినిమాలోని ఒక్క డైలాగ్ కూడా గుర్తులేదంటే సినిమాలో డైలాగ్స్ ఎంత బలహీనంగా ఉన్నాయో అర్థమవుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు డైరెక్టర్లు మంచి డైలాగ్స్ కోసం ఇతర రచయితలపై దృష్టి పెడుతున్నారు. కొరటాల శివ సైతం డైలాగ్స్ విషయంలో ఇతర రచయితలకు ఛాన్స్ ఇస్తే మంచిది. ఆచార్య సినిమా విషయంలో జరిగిన తప్పులను కొరటాల శివ తప్పనిసరిగా సరిదిద్దుకోవాల్సి ఉంది.
ఈ తప్పులు పునరావృతమైతే మాత్రం కొరటాల శివ కెరీర్ పై ప్రభావం పడే ఛాన్స్ ఉంది. తన టాలెంట్ తో ఎదిగిన కొరటాల శివ ఆచార్యతో ఫ్లాప్ ను ఖాతాలో వేసుకోవడం అభిమానులను సైతం బాధ పెడుతోంది.
Most Recommended Video
కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!