పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన అత్తారింటికి దారేది సినిమా అంచనాలను మించి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు కీలక పాత్రలో నటించారు. తాజాగా కోట శ్రీనివాసరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే చాలా ఇష్టమని ఆత్రేయ, జంధ్యాల తర్వాత ఆ కోవలో రాయగల రచయిత త్రివిక్రమ్ మాత్రమేనని కోట శ్రీనివాసరావు అన్నారు.
త్రివిక్రమ్ మాటలలోని భావాన్ని అక్షరాలలో పెడితే పేజీల కొద్దీ రాసుకోవచ్చని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. త్రివిక్రమ్ చదువరి అని మంచి సంస్కారవంతుడు అని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏం రాసినా, ఏం చెప్పినా దానికి పద్ధతి ఉండాలని త్రివిక్రమ్ అనుకుంటారని కోట శ్రీనివాసరావు అన్నారు. అత్తారింటికి దారేది సినిమాలో నెత్తికి తలపాగా కట్టుకుని అద్దంలో చూసుకుంటే గమ్మత్తుగా అనిపించిందని కోట శ్రీనివాసరావు వెల్లడించారు. ఆ సినిమాలో త్రివిక్రమ్ కొన్ని పుస్తకాలను తెప్పించి తన డైలాగ్స్ ను రాశారని కోట శ్రీనివాసరావు కామెంట్లు చేశారు.
త్రివిక్రమ్ తన దగ్గరికి వచ్చి తను ఉన్నాననే ధైర్యంతో డైలాగులు రాశానని చెప్పాడని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు. అత్తారింటికి దారేది సినిమాలో పాత్ర ఇచ్చినందుకు త్రివిక్రమ్ కు రుణపడి ఉంటానని కోట శ్రీనివాసరావు తెలిపారు. సీమ యాసను బాగా పట్టుకున్నానని ప్రశంసలు వచ్చాయని ఆ క్రెడిట్ మొత్తం త్రివిక్రమ్ కే దక్కుతుందని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. అనుకున్నప్పుడల్లా అలాంటి పాత్రలు పడవని కోట శ్రీనివాసరావు కామెంట్లు చేశారు.