ఆయన అడ్డు పడ్డాడు!!!
- January 18, 2017 / 11:44 AM ISTByFilmy Focus
క్రిష్….ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు….తెలుగు సినిమా చరిత్రలోనే ఈ పేరు చాలా ఫేమస్ అయిపోయింది….నట సింహం బాలయ్య 100వ సినిమాను దాత్ర్శకత్వం వహించడం ఒక ఎత్తు అయితే మరో పక్క బ్లాక్ బష్టర్ హిట్ సాదించడం మరో సాహసం అనే చెప్పాలి…ఇదిలా ఉంటే తాజాగా క్రిష్ ఈ సినిమా కోసం విపరీతమైన ప్రమోషన్స్ ఇస్తూ సినిమాను ప్రమోట్ చేస్తూనే సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు…అయితే అదే క్ర్మాంలో ఒకానకో ఇంటెర్వ్యు లో క్రిష్ చెప్పిన మాటలు ఇండస్ట్రీ లో ఒక టాప్ నటుడు ఎలాంటి వాడో అందరికీ తెలిసేలా చేశాయి….విషయంలోకి వెళితే….క్రిష్ సినిమాలు తీయాలి అన్న ఆలోచనతో ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో….రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర పని చేయాలన్న కోరికతో ముంబయికి వెళ్ళాడని చెప్పారు.
అయితే అదే క్రమంలో….జేడీ చక్రవర్తి నాకు అడ్డం పడ్డాడు. అప్పటికి వర్మ నిర్మాణంలో తనేదో సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు. నేను ఆయన్ని కలవకుండా అడ్డం పడ్డాడు. ఆ తర్వాత నేను రకరకాల ప్రయత్నాలు చేసి.. చివరికి మా కుటుంబ సభ్యులు.. స్నేహితుల సహకారంతో ‘గమ్యం’ సినిమా . అంచెలంచెలుగా ఎదిగాను అని క్రిష్ చెప్పాడు….అంతేకాకుండా….అదే విషయాన్ని ఈమహ్డ్య ఒకసారి కలసినప్పుడు వర్మ గారికి చెప్పగా….ఈ విషయంలో జేడీకి థ్యాంక్స్ చెప్పమన్నాడు. అప్పుడు కనుక తనను కలిసి ఉంటే తన స్టయిల్లో ఒక కథ చెప్పి సినిమా తీయమని చెప్పేవాడనని.. అలా కాకుండా సొంతంగా సినిమా చేయడం వల్ల నీకంటూ ఒక పంథా ఏర్పడి మంచి మంచి సినిమాలు తీయగలిగినట్లు చెప్పాడట. మొత్తంగా క్రిష్ తన అనుభవాలని ఇలా మీడియాకు ఒక్కొక్కటిగా చెబుతూ ఉండడంతో ఇండస్ట్రీ పై ఆసక్తి మరింత పెరుగుతుంది సగటు ప్రేక్షకుడికి…
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














