Krithi Shetty: హాట్ టాపిక్ అయిన కృతి శెట్టి లేటెస్ట్ కామెంట్స్
- August 29, 2024 / 01:02 PM ISTByFilmy Focus
‘ఉప్పెన’ (Uppena) సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి (Krithi Shetty) . ఆ సినిమా సక్సెస్ లో కృతి గ్లామర్ కీ-రోల్ ప్లే చేసింది. ఆమె పారితోషికం కూడా 10 ఇంతలు పెరిగేలా చేసింది. ఆ తర్వాత నానితో (Nani) చేసిన ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singha Roy) , నాగ చైతన్యతో (Naga Chaitanya) చేసిన ‘బంగార్రాజు'(Bangarraju) వంటి సినిమాలు కూడా బాగా ఆడాయి. అయితే రామ్ (Ram) తో చేసిన ‘ది వారియర్’ (The Warriorr) నుండి ఆమెకు ప్లాపులు మొదలయ్యాయి.
Krithi Shetty

‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam) ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ‘కస్టడీ’ (Custody) వంటి సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఇటీవల వచ్చిన ‘మనమే’ (Manamey) కూడా పెద్దగా ఆడింది అంటూ ఏమీ లేదు. తెలుగులో ఈ అమ్మడికి ఆఫర్లు లేవు. మలయాళంలో ఒక సినిమా, తమిళంలో 3 సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది కృతి శెట్టి. ఆమె మాట్లాడుతూ.. ” నేను చేసిన ‘ఉప్పెన’ సక్సెస్ అయ్యింది.

ఆ టైంలో నాకు ప్లాప్ పడాలని చాలా మంది ఎదురుచూశారు. నాకు ప్లాప్ వస్తే విమర్శించాలని వాళ్ళు ఆశపడ్డారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటి? అంటే సక్సెస్ ని, ఫెయిల్యూర్ ని నేను ఒకేలా తీసుకున్నాను. సక్సెస్ వచ్చినప్పుడు.. పూర్తిగా అది నా క్రెడిట్ కాదు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా నేను పూర్తిగా బాధ్యురాలిని కాదు. ఇంకా చెప్పాలంటే ఫెయిల్యూర్స్ వల్లనే నేను స్ట్రాంగ్ అయ్యాను” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. కానీ ఆమె ప్లాప్ ను కోరుకుంది ఎవరో నేరుగా చెప్పలేదు.
















