మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన ‘గుంటూరు కారం’ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది ఈ మూవీ. అయినప్పటికీ మహేష్ బాబు- త్రివిక్రమ్.. లకు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉండటంతో.. ఈ సినిమా రూ.110 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేసి.. కమర్షియల్ గా పర్వాలేదు అనిపించింది.
జీఎస్టీ వంటివి తీసేస్తే చాలా చోట్ల ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయినట్టు ట్రేడ్ పండితులు వెల్లడించారు. అయినప్పటికీ ‘గుంటూరు కారం’ సినిమా ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తి పరిచిన సినిమా అని చెప్పలేం. ముఖ్యంగా మ్యూజిక్ పరంగా..! తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. త్రివిక్రమ్ గత సినిమాలు అయిన ‘అల వైకుంఠపురములో’ ‘అరవింద సమేత’ వంటి వాటికి మంచి మ్యూజిక్ ఇచ్చాడు తమన్.
కానీ ‘గుంటూరు కారం’ విషయంలో అతను పూర్తిగా డ్యూటీ చేయలేదు. ‘అల వైకుంఠపురములో’ సినిమాకి రెండు, మూడు 100 మిలియన్ సాంగ్స్ ఇచ్చాడు. ‘గుంటూరు కారం’ విషయంలో ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయలేకపోయాడు. అయితే ఉన్నంతలో.. ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ రికార్డులు క్రియేట్ చేసింది. దీనికి కూడా మొదట రెస్పాన్స్ బాలేదు.
కానీ సంక్రాంతి పండుగకు రిలీజ్ అయిన సినిమాల్లో ఈ ఒక్క పాటే ఊపింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యాక.. ఈ పాటకు మరింత ఆదరణ పెరిగింది. తాజాగా ఈ పాట (Kurchi Madathapetti) యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టి ఓ రేర్ రికార్డు క్రియేట్ చేసింది.