ప్రభాస్ ప్యాన్ ఇండియన్ స్టార్ ఇమేజ్ దాటిపోయి చాలా ఏళ్లవుతోంది. బాహుబలి ముందువరకు ప్రభాస్ (Prabhas) ఒక తెలుగు హీరో, ఆ తర్వాత ప్యాన్ ఇండియన్ హీరో, కానీ “కల్కి” రిలీజ్ అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అలాంటి ప్రభాస్ (Prabhas) ఎవుడో నాకు తెలియదు అని ఓ సీనియర్ పొలిటీషియన్ కామెంట్ చేయడం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఆమె మరెవరో కాదు స్వయానా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల.
Prabhas
గతంలో ప్రభాస్ (Prabhas) & షర్మిలను లింక్ చేస్తూ పలు ఊహాగానాలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే.. అవన్నీ రాజకీయ కక్ష సాధింపు చర్యలు అని కొట్టిపారేశారు. ఇక అప్పట్లో ఈ రూమర్ల గోల తట్టుకోలేక, ప్రభాస్ క్లారిటీ కూడా ఇచ్చాడు. అయితే.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత షర్మిల పనిగట్టుకుని ప్రభాస్ టాపిక్ తీసుకురావడం లేనిపోని చర్చలకు దారి తీసింది. ఈ రచ్చ మొత్తం చేయించింది జగన్ ఆమె ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది.
అయితే.. ఆమె మాట్లాడినప్పుడు కాస్త సంస్కారవంతంగా ప్రభాస్ (Prabhas) ఎవరో తెలియదు అంటే సరిపోయేది కానీ.. ఎవుడో తెలియదు అని కాస్త ఇబ్బందికరంగా మాట్లాడిన వీడియోను ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ సీరియస్ గా తీసుకొని ఆమెను తిట్టిపోస్తున్నారు. హ్యాపీగా వరుస సినిమాలు చేసుకుంటున్న ప్రభాస్ కి ఈ లేనిపోని వార్తలు ప్రశాంతత లేకుండా చేయడం తప్ప ఏమీ ఉండదు.
మరి ప్రభాస్ మళ్లీ ఈ విషయమై స్పందిస్తాడా లేక ఇప్పుడు తనకున్న ఇమేజ్ కి ఇలాంటి విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి లైట్ తీసుకుంటాడా అనేది చూడాలి. ఏదేమైనా పొలిటీషియన్లు ఇలా ఇష్టం వచ్చినప్పుడు, ఇష్టమొచ్చినట్లుగా సినిమావాళ్లని టార్గెట్ చేస్తూ.. వాళ్ల పేర్లు వాడుకోవడం అనేది ఎప్పడు మానతారో!