మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ హడా డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో మార్చి 1 న ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నారు అని చెప్పాలి. ‘సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్’, ‘సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించగా ‘గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్’ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతగా వ్యవహరించారు.
మానుషి చిల్లర్ ఈ చిత్రంలో హీరోయిన్ కాగా మరో హీరోయిన్ రుహాని శర్మ కూడా కీలక పాత్ర పోషించింది. ఇక నవదీప్, అలీ రెజా ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా ట్రైలర్లోని విజువల్స్ కి అందరూ సర్ప్రైజ్ అయ్యారు. హిందీ ట్రైలర్ కనుక చూస్తే.. అందులో వరుణ్ తేజ్ హిందీలో కూడా ఓన్ డబ్బింగ్ చెప్పుకున్నట్టు స్పష్టమవుతుంది.
అయితే ‘ఆపరేషన్ వాలెంటైన్’ హిందీ వెర్షన్ కోసం వరుణ్ తేజ్ 2 నెలల పాటు హిందీ క్లాసులు తీసుకున్నాడట. అయినా అతనికి హిందీ సరిగ్గా వచ్చేది కాదట. అప్పుడు లావణ్య త్రిపాఠి హెల్ప్ చేసినట్లు అతను చెప్పుకొచ్చాడు. లావణ్య త్రిపాఠి కూడా నార్త్ కు చెందిన అమ్మాయి అనే సంగతి తెలిసిందే.అందుకే ‘ఇంట్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఓ సెంటెన్స్ కి మూడు లాంగ్వేజ్..లు వస్తుంటాయని, ‘ఆపరేషన్ వాలెంటైన్’ హిందీ వెర్షన్ కి డబ్బింగ్ ఓన్ గా చెప్పుకోవడం వెనుక లావణ్య హస్తం ఉందని’ వరుణ్ తేజ్ (Varun Tej) రివీల్ చేశాడు.