‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా ప్రాజెక్టులు ఎక్కువగా రూపొందుతున్నాయి. ఈ మధ్య కాలంలో రూపొందిన పాన్ ఇండియా సినిమాలను కరెక్ట్ గా గమనిస్తే ఎక్కడో ఒకచోట మలయాళం నటులు కనిపిస్తారు.మరీ ముఖ్యంగా టాలెంట్ ఉన్న నటులకు టాలీవుడ్ పెద్ద పీట వేస్తుంది అన్న సంగతి తెలిసిందే. అందుకే టాలెంట్ ఉన్న మలయాళం నటులకు కోట్లకు కోట్లు పారితోషికం చెల్లించి టాలీవుడ్ కు పట్టుకొస్తున్నారు దర్శకనిర్మాతలు. పాన్ ఇండియా సినిమా అన్నాక.. కచ్చితంగా అన్ని భాషల్లో పాపులర్ అయిన నటులను తీసుకోవాలి. అదే విధంగా మలయాళం నుండి అయితే హీరోలనే దింపుతున్నారు మన టాలీవుడ్ దర్శక నిర్మాతలు. ఈ క్రమంలో టాలీవుడ్లో అడుగుపెట్టి తమ నటనతో ఇక్కడి ప్రేక్షకుల్ని మెప్పించిన హీరోలు, మెప్పించడానికి రెడీగా ఉన్న హీరోలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :
1) మమ్ముట్టి :
ఆల్రెడీ ఈయన ‘స్వాతి కిరణం’ ‘యాత్ర’ వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు అఖిల్ నటిస్తున్న ‘ఏజెంట్’ సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు.
2) జయరాం :
మలయాళం సీనియర్ హీరో అయిన ఇతను కూడా ‘అల వైకుంఠపురములో’ అనే చిత్రంలో నటించి మెప్పించాడు. ఇప్పుడు రవితేజ నటిస్తున్న ‘ధమాకా’ మూవీలో కూడా నటిస్తున్నాడు.
3) బిజూ మీనన్ :
మలయాళంలో పెద్ద హీరో. రణం, ఖతర్నాక్ వంటి తెలుగు సినిమాల్లో కూడా నటించి మంచి మార్కులు సంపాదించుకున్నాడు. ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ లో ఇతను పోషించిన పాత్రనే ‘భీమ్లా నాయక్’ లో పవన్ కళ్యాణ్ పోషించాడు.
4) రోషన్ మాథ్యూ :
నాని హీరోగా తెరకెక్కుతున్న ‘దసరా’ చిత్రంలో ఇతను విలన్ గా నటిస్తున్నాడు.
5) ఉన్ని ముకుందన్ :
ఇతను కూడా తెలుగులో ‘జనతా గ్యారేజ్’ ‘భాగమతి’ ‘ఖిలాడి’ ‘యశోద’ వంటి చిత్రాల్లో నటించాడు.
6) దేవ్ మోహన్ :
సమంత- గుణశేఖర్ కాంబినేషన్లో రూపొందుతున్న చారిత్రాత్మక చిత్రంలో ఇతను కీలక పాత్ర పోషించాడు.
7) దుల్కర్ సల్మాన్ :
మలయాళంలో పెద్ద స్టార్ హీరో. తెలుగులో ‘మహానటి’ ‘సీతారామం’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు.
8) మోహన్ లాల్ :
జనతా గ్యారేజ్ సినిమాలో హీరోతో సమానమైన పాత్రను పోషించి మెప్పించాడు.
9) ఫహాద్ ఫాజిల్ :
మలయాళంలో పెద్ద హీరో.. తెలుగులో ‘పుష్ప'(ది బిగినింగ్) లో చాలా అద్భుతంగా నటించాడు. ‘పుష్ప 2’ లో కూడా ఇతనిది పెద్ద పాత్ర.
10) పృథ్వీరాజ్ సుకుమారన్ :
‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తో చాలా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సలార్’ మూవీలో నటిస్తున్నాడు.