తన లాగే తన పెద్ద తమ్ముడు నాగబాబు ని కూడా హీరోగా నిలబెట్టాలని ప్రయత్నించాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే నాగబాబు మంచి నటుడు అనిపించుకున్నాడు కానీ హీరోగా ఎదగలేకపోయాడు. హీరోగా కూడా పలు సినిమాలు చేసాడు కానీ అవి సక్సెస్ కాలేదు. ఇక నటుడుగానే కొనసాగుతున్న తరుణంలో .. అన్నయ్య చిరంజీవి సపోర్ట్ తో సినిమాలు నిర్మించాలి అనుకున్నాడు.తన తల్లి పేరు పై ‘అంజనా ప్రొడక్షన్స్’ సంస్థను స్థాపించి చిరుతో సినిమాలు నిర్మించాడు కానీ అందులో ఒక్కటి మినహా ఏదీ పెద్దగా ఆడలేదు. ఇంతకీ ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) రుద్రవీణ :
నాగబాబు నిర్మాతగా మారి చేసిన మొదటి చిత్రం.. ‘రుద్ర వీణ’. కె.బాలచందర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ… నేషనల్ అవార్డు కొట్టింది.
2) త్రినేత్రుడు :
చిరంజీవి 100వ చిత్రాన్ని నిర్మించే ఛాన్స్ ను తమ్ముడు నాగబాబుకే అప్పగించాడు చిరు.కోదండరామి రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ప్లాప్ గా మిగిలింది.
3) ముగ్గురు మొనగాళ్లు :
రాఘవేంద్ర రావు డైరెక్షన్లో చిరు ట్రిపుల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రాన్ని కూడా నాగబాబే నిర్మించాడు. ఈ చిత్రం యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.
4) బావగారూ బాగున్నారా :
నాగబాబు – చిరు కాంబినేషన్లో వచ్చిన ఏకైక హిట్టు చిత్రం ఇదే. జయంత్.సి.పరాన్జీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు.
5) స్టాలిన్ :
చిరు – నాగబాబు కాంబినేషన్లో వచ్చిన 5వ చిత్రం ఇది. మురుగదాస్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.