Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Focus » రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

  • May 31, 2025 / 01:01 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

ఓ సినిమాకి పాటలు హిట్ అయితే… సగం సినిమా హిట్ అయినట్టే అని అంతా అంటుంటారు. ఓ పక్క నటీనటుల పారితోషికాలు ఆకాశాన్నంటుతున్నాయి. మరి సినిమాకి మ్యూజిక్ తో అండగా నిలిచే.. సంగీత దర్శకుల (Music Directors ) పేమెంట్లు సంగతేంటి? ఈ ప్రశ్న చాలా మందిలో ఉంది. కానీ వాళ్ళు కూడా తగ్గడం లేదు. కోట్లకు కోట్లు డిమాండ్ చేస్తున్నారు. భారీ పారితోషికాలు అందుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

Music Directors

1) అనిరుథ్ (Anirudh Ravichander) :

తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ (Music Directors) అనిరుథ్ రవిచందర్ ఇప్పుడు డిమాండ్ మామూలుగా లేదు. అతని మ్యూజిక్ కావాలని స్టార్ హీరోలు దర్శకనిర్మాతలను అడిగి మరీ తమ సినిమాలకు పెట్టించుకుంటున్నారు. దీంతో అనిరుథ్ డిమాండ్ కూడా గట్టిగానే ఉంటుంది. అతని పారితోషికం రూ.15 కోట్లు పలుకుతుంది. నాని (Nani) ‘ది పారడైజ్’ (The Paradise) సినిమా కోసం అనిరుథ్ ని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఈ సినిమా కోసం అతనికి రూ.15 కోట్లు పారితోషికం ఇస్తున్నారు. అయితే ఆడియో రైట్స్ రూపంలో ఆల్రెడీ రూ.18 కోట్లు వచ్చేశాయి. సో అతనికి అంత మొత్తం ఇవ్వడంలో తప్పేమీ లేదు అని ప్రూవ్ అయ్యింది.

2) దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) :

Devi Sri Prasad 10 Unknown and interesting facts about Devi Movie

ఇప్పుడు కాస్త సైలెంట్ అయినట్టు కనిపించినా దేవి శ్రీ ప్రసాద్ డిమాండ్ ఏమీ తగ్గలేదు. అతను సంగీతం అందించే సినిమాలకి ఆడియో రైట్స్ గట్టిగానే పలుకుతున్నాయి. దీంతో అతను కూడా రూ.10 కోట్లు అందుకుంటున్నాడు.

3) ఏ ఆర్ రెహమాన్ (A.R.Rahman) :

A.R.Rahman Unknown and Interesting facts About Bombay Movie

ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్.. తన సంగీతంతో ఒకప్పుడు ఓ ఊపు ఊపిన వ్యక్తే. కానీ ఇప్పుడు అతను మాస్ ఆడియన్స్ కి నచ్చేలా మ్యూజిక్ ఇవ్వలేకపోతున్నారు అనే రిమార్క్ ఉంది. అయినప్పటికీ అతని డిమాండ్ ఏమీ తగ్గడం లేదు. ‘పెద్ది’ (Peddi) సినిమా కోసం అతను రూ.8 కోట్లు పారితోషికం అందుకున్నట్టు సమాచారం.

4) తమన్ (S.S.Thaman) :

Thaman OG concert videos gone viral

క్షణం తీరిక లేకపోయినా పెద్ద పెద్ద ప్రాజెక్టులకి తమన్ ను తీసుకుంటున్నారు.అయినప్పటికీ ప్రతి సినిమాకు తన బెస్ట్ ఇస్తున్నాడు. ఔట్పుట్ త్వరగా ఇచ్చేస్తాడు అనే కాన్ఫిడెన్స్ ఇతనిపై మేకర్స్ కు ఉంది. అందుకే ఇతను రూ.7 కోట్లు పారితోషికం డిమాండ్ చేసినా కథనకుండా ఇచ్చేస్తున్నారు.

5) అజనీష్ లోకనాథ్ (B. Ajaneesh Loknath) :

‘కాంతార’ తో ఈ కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ సౌత్ మొత్తం పాపులర్ అయిపోయాడు.థ్రిల్లర్ సినిమాలకి ఇతను అందించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది. ‘విరూపాక్ష’ (Virupaksha) ‘మంగళవారం’ (Mangalavaram) సినిమాలతో ఇతని రేంజ్ మరింతగా పెరిగింది. ‘పుష్ప 2’ (Pushpa 2) కి కూడా ఇతను పనిచేశాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.6 కోట్లు పారితోషికం అందుకుంటున్నాడు అజనీష్.

6) రవి బస్రూర్ (Ravi Basrur) :

‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ (KGF) తో రవి బస్రూర్ రేంజ్ పెరిగింది. ఆ సినిమాకి ఇతను అందించిన బ్యాక్ గ్రౌండ్ ప్రపంచం మొత్తం మార్మోగింది. దీంతో పాన్ ఇండియా సినిమాలకి ఇతను కూడా ఫస్ట్ ఆప్షన్ అయిపోయాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఇతను రూ.5 కోట్లు పారితోషికం అందుకుంటున్నట్టు తెలుస్తుంది.

7) ఎం ఎం కీరవాణి (M. M. Keeravani) :

Music Composer MM Keeravani Shares an Update about SSRMB Movie (1)

ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణికి పాన్ ఇండియా ఇమేజ్ ఉంది. పైగా ఆస్కార్ కూడా తోడైంది కాబట్టి.. ఆ ఇమేజ్ ను తన సినిమాలకి వాడుకుని ప్రమోట్ చేసుకోవాలని కొన్ని సినిమా యూనిట్లు భావిస్తున్నాయి. దీంతో ఈ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు.

8) యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) :

తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా ఇప్పటికీ పలు సినిమాలకి చార్ట్ బస్టర్ సాంగ్స్ ఇస్తూ తన సత్తా చాటుతున్నాడు. దీంతో అతనికి కూడా రూ.5 కోట్లు పారితోషికం కాదనకుండా ఇచ్చేస్తున్నారు నిర్మాతలు.

9) భీమ్స్ (Bheems Ceciroleo) :

‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) తర్వాత భీమ్స్ రేంజ్ మారిపోయింది. చిరంజీవి (Chiranjeevi) సైతం నాకు భీమ్స్ సంగీతం కావాలని దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) సినిమాకి పెట్టుకున్నారు. ఈ సినిమా కోసం భీమ్స్ కి రూ.3 కోట్లు పారితోషికం ఇస్తున్నారు.

10) జి వి ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar) :

నటుడిగా ఎంత బిజీ అయినా సంగీత దర్శకుడిగా ఎప్పటికప్పుడు తన స్టామినా చాటుతూనే ఉన్నాడు జి వి ప్రకాష్ కుమార్. ఇప్పుడు అతను ఒక్కో సినిమాకు రూ.2 కోట్లు పారితోషికం అందుకుంటున్నాడు.

11) రథన్ (Radhan) :

Radhan Reacts to Arjun Reddy Controversy with Emotional Clarity1

దర్శకుల నుండి ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నప్పటికీ.. రథన్ సంగీతం ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అందుకే అతనికి కూడా డిమాండ్ ఉంది. ఒక్కో సినిమాకి అతను కోటి నుండి రూ.1.5 కోట్ల వరకు అందుకుంటున్నాడు.

పవన్ కళ్యాణ్ కోపం కరెక్ట్ కాదు అంటున్న ఆర్.నారాయణ మూర్తి !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R.Rahman
  • #Anirudh Ravichander
  • #B. Ajaneesh Loknath
  • #devi sri prasad
  • #Ravi Basrur

Also Read

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

related news

Devi Sri Prasad: ఎల్లమ్మ హీరో దేవి శ్రీ ప్రసాద్.. ఇదేం ట్విస్ట్ బాబూ..!

Devi Sri Prasad: ఎల్లమ్మ హీరో దేవి శ్రీ ప్రసాద్.. ఇదేం ట్విస్ట్ బాబూ..!

Sai Abhyankkar: సాయి అభ్యంకర్… అనిరుధ్ కి రీప్లేస్మెంట్ దొరికినట్టేనా?

Sai Abhyankkar: సాయి అభ్యంకర్… అనిరుధ్ కి రీప్లేస్మెంట్ దొరికినట్టేనా?

trending news

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

Dude Collections: 6వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘డ్యూడ్’

10 hours ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ ఇలా అయితే కష్టం కదా!

10 hours ago
Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

Kantara Chapter 1 Collections: 3వ వారం కూడా పర్వాలేదనిపించిన ‘కాంతార చాప్టర్ 1’.. కానీ!

10 hours ago
Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. 25 శాతం రికవరీ కూడా సాధించలేదు..!

10 hours ago
K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

K-Ramp Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘K-RAMP’

10 hours ago

latest news

Vash 2: హాలీవుడ్ రేంజ్ హారర్ థ్రిల్లర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Vash 2: హాలీవుడ్ రేంజ్ హారర్ థ్రిల్లర్.. అస్సలు మిస్ అవ్వకండి!

12 hours ago
Rashmika Mandanna: వేల కోట్ల హీరోయిన్.. 35 లక్షల వసూళ్లా?

Rashmika Mandanna: వేల కోట్ల హీరోయిన్.. 35 లక్షల వసూళ్లా?

12 hours ago
Arka Media: ‘బాహుబలి’ హ్యాంగోవర్.. రాజమౌళి లేని ఆర్కాకు ఆ సత్తా లేదా?

Arka Media: ‘బాహుబలి’ హ్యాంగోవర్.. రాజమౌళి లేని ఆర్కాకు ఆ సత్తా లేదా?

12 hours ago
Shiva Rajkumar: తెలుగోడి బయోపిక్ లో తెలుగోళ్లు నటించలేరా?

Shiva Rajkumar: తెలుగోడి బయోపిక్ లో తెలుగోళ్లు నటించలేరా?

12 hours ago
Fauzi Movie: ఫౌజీ.. ప్రభాస్ కెరీర్‌కే బిగ్గెస్ట్ రిస్క్?

Fauzi Movie: ఫౌజీ.. ప్రభాస్ కెరీర్‌కే బిగ్గెస్ట్ రిస్క్?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version