మన టాలీవుడ్ హీరోలు కూడా ఒక్కొక్కరు ఒక్కో దేవుడిని ఆరాధిస్తూ ఉంటారు. చిరంజీవి (Chiranjeevi), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ..హనుమంతుని భక్తులు. వెంకటేష్ కి (Venkatesh) వినాయకుడిపై నమ్మకం ఎక్కువ. బాలకృష్ణకి (Nandamuri Balakrishna) నరసింహ స్వామి అంటే ఇష్టం. మోహన్ బాబుకు (Mohan Babu) షిరిడి సాయి భక్తులు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది. అయితే నిన్న అంటే ఫిబ్రవరి 27న దేశవ్యాప్తంగా శివరాత్రి సంబరాలు ఘనంగా జరిగాయి. కాబట్టి టాలీవుడ్ హీరోల్లో శివుడికి అపర భక్తుడు ఎవరైనా ఉన్నారా? అనే చర్చ సోషల్ మీడియాలో నడిచింది.
ఆ ప్రశ్నకు సమాధానం ప్రభాస్ (Prabhas) అనే చెప్పాలి. అవును ప్రభాస్ కి అలాగే కృష్ణంరాజు (Krishnam Raju) .. శివుడు అంటే అపారమైన నమ్మకం. కృష్ణంరాజు ‘భక్త కన్నప్ప’ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ కి కూడా అంతే..! తన భక్తిని చాలా సినిమాల్లో చాటుకున్నాడు ప్రభాస్. డౌటా… కావాలంటే ఈ లిస్ట్ ను ఒక లుక్కేయండి.. మీకే అర్థమవుతుంది :
1) ఈశ్వర్ (Eeswar) :
ప్రభాస్ (Prabhas) డెబ్యూ మూవీ ‘ఈశ్వర్’. ఆ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ పేరు కూడా ఈశ్వర్.జయంత్ సి పరాన్జీ (Jayanth C. Paranjee) దీనికి దర్శకుడు. అది శివుడికి మరో పేరు అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాను కూడా 2002 నవంబర్ 11 న అంటే సోమవారం నాడు రిలీజ్ చేశారు. సోమవారం శివునికి ఇష్టమైన రోజు అనే సంగతి తెలిసిందే.
2) అడవి రాముడు (Adavi Ramudu) :
ఈ సినిమాలో ఒక సీన్లో ప్రభాస్ (Prabhas) పామును మెడలో వేసుకుంటాడు. అప్పుడు అతని ఫ్రెండ్స్ అంతా శివుడిలా ఉన్నావు అంటూ ప్రశంసిస్తారు.
3) ఛత్రపతి (Chatrapathi) :
అలాగే ప్రభాస్ ని (Prabhas) మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ‘ఛత్రపతి’. రాజమౌళి (S. S. Rajamouli) దీనికి దర్శకుడు. ఈ సినిమాలో ప్రభాస్ పేరు శివ. అది కూడా శివుని రిఫరెన్స్ అనే సంగతి తెలిసిందే. తర్వాత ‘ఛత్రపతి’ గా మారతాడు.
4) పౌర్ణమి (Pournami) :
ప్రభాస్ హీరోగా ప్రభుదేవా (Prabhu Deva) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. ఇందులో ప్రభాస్ క్యారెక్టర్ పేరు శివ కేశవ నాయుడు. శివ కేశవ అంటే శివుని రిఫరెన్స్ అనే సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. అందులో ప్రభాస్ ఫ్లూట్ ఊడితే పాము వచ్చి అతని మెడ చుట్టూ చేరుతుంది. అది కూడా శివుని రిఫరెన్స్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
5) యోగి (Yogi) :
ప్రభాస్- వి.వి.వినాయక్ (V. V. Vinayak) కాంబినేషన్లో రూపొందిన మూవీ ఇది. ఇందులో ప్రభాస్ పేరు ఈశ్వర్ ప్రసాద్. అంటే శివుని రిఫరెన్స్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతే కాదు.. ఈ సినిమాలో ప్రభాస్ ఇంట్రో సాంగ్ కూడా శివుడిపైనే ఉంటుంది.
6) బాహుబలి ది బిగినింగ్ (Baahubali) :
ప్రభాస్ – రాజమౌళి- రానా కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో యంగ్ ప్రభాస్ క్యారెక్టర్ పేరు శివుడు. తర్వాత అతను మహేంద్ర బాహుబలి గా మారతాడు. అలాగే ఈ సినిమాలో శివ లింగం పట్టుకుని వెళ్లే ఎపిసోడ్ ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ సాంగ్ కూడా ఉంటుంది.
7) బాహుబలి 2( ది కన్క్లూజన్) (Baahubali 2) :
ప్రభాస్ – రాజమౌళి – రానా కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ అమరేంద్ర బాహుబలిగా కనిపిస్తాడు. అలాగే అనుష్కని ఇంప్రెస్ చేయడానికి.. కుంతల రాజ్యం వెళ్ళినప్పుడు అతని పేరు శివుడు అని చెబుతాడు.
8) ఆదిపురుష్ (Adi Purush) :
‘రామాయణం’ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్ హీరో. ఇందులో ‘శివోహం’ అనే పాట ఉంటుంది.
9) సలార్(సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్) (Salaar) :
ప్రభాస్ – ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ పేరు దేవా. అది కూడా శివుడికి మరో పేరు అని అంటుంటారు.
10) కల్కి 2898 AD (Kalki 2898 AD) :
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ పేరు భైరవ. అది కూడా శివుని రిఫరెన్స్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
11) కన్నప్ప (Kannappa) :
మంచు విష్ణు (Manchu Vishnu) నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమాలో ప్రభాస్ కూడా చిన్న క్యామియో చేస్తున్నాడు.ఇందులో అతని క్యారెక్టర్ పేరు ‘రుద్ర’. అది శివుడికి మరో పేరు అనే సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కథ అంతా కూడా శివుడిపైనే ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.